Sunday, October 23, 2011

సకలజనులారా! ఇప్పటికైనా కళ్ళు తెరవండి!


సకలజనులారా !
 మీ త్యాగాల ఖరీదు ప్రస్తుతానికి, వందల  కోట్ల రూపాయల పోలవరం కాంట్రాక్టులు.
 మీ త్యాగాల ఖరీదు రాబోయే ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలు.    
 మీ త్యాగాల ఖరీదు - కేంద్ర , రాష్ట్ర , మంత్రి పదవులూ ---  కాంట్రాక్టులూ - దోపీడూలూ- కుంభ కోణాలూ.  
ఇప్పటికైనా గుర్తించారా మీ ఉద్యమ బలహీనతలేమిటో?
మీ ఉద్యమ ప్రధాన బలహీనత మీ ప్రధాన నాయకుడు కేసియారూ అతడి కుటుంబమే.
     సోనియా గాంధీతో కలిసి కేసీయార్ ఆడుతున్న డ్రామా ఇంకా మీకూ ,మీ జేఏసీ నాయకులకి తెలియదనుకోవాలా? సకలజనుల సమ్మె కు కొద్దిరోజుల ముందు మీ కేసీయార్ "2014 ఎన్నికల వరకూ తెలంగాణా వచ్చేటట్టు లేదు" అని చెప్పినప్పుడే మాకందరికీ అర్ధమయింది. మీకింకా అర్ధం కాలేదంటే మీరు నిజంగా ...... .... 
     కోతినాడించి బతికే  వాడి బతుకు ఆ కోతి బతికున్నంతసేపే . అందుకే వాడు దాన్ని చావనివ్వడు, అలాగని బలవనివ్వడు. అది బలిస్తే తనని పీకేస్తుందని తెలుసు.  అందుకే అంత గ్యారంటీగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తాను కాపలా కుక్క లా ఉంటానని చెపుతున్నాడు.  కేసీయార్ చచ్చేదాకా తెలంగాణా రాదనీ, రానివ్వడనీ ఇప్పటికైనా తెలుసుకొండి!
     ఇంత కాలంగా ఉద్యమం జరుగుతున్నా, మీరు మీ రాజకీయ నాయకులందరినీ ఒక్క తాటి మీదకు తేలేకపోయారు, పైగా ఇది సీమాంధ్రుల కుట్ర అంటూ బురద జల్లుతారు. మీ తెలంగాణలోజై తెలంగాణా అంటూ , ఎమ్మెల్యేలుగా మంత్రులుగా  ప్రభుత్వంలో  ఉంటూ, అధికారాల్ని అనుభవిస్తూ, దొంగ బతుకు బతుకుతున్న వారిని వదిలేసి , సీమాంధ్ర నాయకుల్ని టార్గెట్ గా చేసుకోవడం సిగ్గుగా అనిపించడం లేదూ ? 
   మీ మంత్రులు దానం , ముఖేష్ , జానా వగైరాల మీద కి వెళ్ళగలరా? ఓవైసీల వెంట్రుకైనా పీకగాలరా ?   చూసారుగా దానం మీదికేల్తే ఏం జరిగిందో ?  
     గత కొన్ని సంవత్సరాలుగా మీరు  మీ  నాయకులు ఎలా ఆడమంటే అలా ఆడడమే గానీ ఒక్కరైనా (స్వామీ గౌడ్ తప్ప )  మీ నాయకుల్ని నిలదీయ గలిగారా ?
 మీ నాయకుల్ని నిలదీయడం ,  ఐక్యం చెయ్యలేక  పోవడమే మీ బలహీనత.


మీరు చేస్తున్న రాస్తా రోకోలు , బందులు ,జనజీవనాన్ని ఎంత అస్తవ్యస్తం చేస్తున్నాయో మీకు అనుభవిస్తేనే గానీ తెలియదు. రెక్కాడితే గాని డొక్కాడని రోజుకూలీలు ఏమైపోతున్నారో ఎవరైనా పట్టించుకున్నారా ? ఉద్యోగులకి వడ్డీతో జీతాలిచ్చేస్తానంటున్న కేసీయార్ వీళ్ళకేం సమాధానం చెపుతాడు?
అసలు మీ జేఏసీ లు సమ్మె ఏ డిమాండు తో మొదలెట్టాయి ? ఏ డిమాండ్లు సాధించుకుని విరమిస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని స్వంత డిమాండ్లు సాధించు కుంటున్న వారిని కనిపెట్టండి. 

1 comment:

  1. Good post, thank you.

    This is not 1969, Telangana will not tolerate a betrayal. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తమని కాళోజి చెప్పిన మాటలు నిజమయితయి.

    Having said this, Babu & his cronies have no credibility left any longer. తెలంగాణపై అర్ధరాత్రి face turning ఇచ్చుకొని వచ్చిన రాష్ట్రాన్ని ఆపిన విషయం మరిచి పోలేము.

    ReplyDelete