Showing posts with label ప్రియా నీ కోసం.... Show all posts
Showing posts with label ప్రియా నీ కోసం.... Show all posts
Thursday, April 4, 2013
Monday, April 1, 2013
Sunday, March 17, 2013
Friday, March 9, 2012
Thursday, March 8, 2012
ఋషి సినిమాలోని అద్భుతమైన కవిత మీ కోసం...!!!
నిన్నలన్నీ తెలిసిన సమయమా
కదలక నిలిచిపోవా కాసేపు
కనులను వదిలిపోయే చూపులతో
కనులారా తనని చూడాలి .
మనసారా మాట్లాడాలి.
సంపూర్ణమైనది నా జీవితం
ఆకాశమంత ఆనందంతో
ఈ ఆనందానికి రూపం నువ్వే.
నా జేవితనికి అర్ధం నువ్వే..
ఈ సాగరాన ఎగిసే కెరటాలు
నా హృదయాన మధుర జ్ఞాపకాలు
ఇంతటి సంతోషాన్ని కానుక చేసింది నువ్వే..!
ఒడిలో తనవాడినై, పసివాడినై
అడుగడుగునా, ప్రతిఅడుగునా
నేను తనలోనే ఉన్నాను,తన తోటే ఉంటాను.
ఇప్పటికీ...ఎప్పటికీ...
ఒక స్వాప్నికుడిగా...తన ప్రేమికుడిగా...!
Wednesday, September 14, 2011
తాకే ప్రతి అల నీ జ్ఞాపకం......!!!
సముద్ర తీరాన ఒంటరి పయనం
తాకే ప్రతి అల నీ జ్ఞాపకం
నా కాళ్ళను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే
నీవులేని నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా........ ??
వీచే చిరుగాలి నా మేను ని తడుముతూ ఉంటే
నీ స్పర్స ను గుర్తుచేస్తుంటే
నీ తోడు ఏది అని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా...... ??
నేను వేసే ప్రతి అడుగు
తన తోడును వెతుకుతూ ఉంటే
నీ తోడు ఏది అని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
మౌనం గా తల వొంచాను వాటి ప్రశ్నలకి
ఎప్పటికీ చెప్పలేనని తెల్సి..సమాధానం చెప్పలేక ..
Sunday, September 4, 2011
పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే..
నలుగురిలో ఉన్నా నీ ధ్యాసే..
నాలుగు గోడల మధ్యా నీ ధ్యాసే...
నడిచే దారంతా నీ ధ్యాసే...
నిదురమాని రేయంతా నీ ధ్యాసే...
పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే..
కనులు కన్నీటిని ఓలకబోస్తున్నా నీ ధ్యాసే...
చిరుగాలుల పలకరింప్పుల్లొ నీ ధ్యాసే...
చిరుజల్లుల పులకరింత్తల్లొనూ నీ ధ్యాసే..
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే...
ఏపని చేస్తున్నా..ఎటుపోతున్నా నీధ్యాసే
నీన్నే తలస్తూ నీకోసమే ఆలోచీస్తూ నాప్రాణాన్ని విడుస్తా ప్రియా..!న
నాలుగు గోడల మధ్యా నీ ధ్యాసే...
నడిచే దారంతా నీ ధ్యాసే...
నిదురమాని రేయంతా నీ ధ్యాసే...
పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే..
కనులు కన్నీటిని ఓలకబోస్తున్నా నీ ధ్యాసే...
చిరుగాలుల పలకరింప్పుల్లొ నీ ధ్యాసే...
చిరుజల్లుల పులకరింత్తల్లొనూ నీ ధ్యాసే..
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే...
ఏపని చేస్తున్నా..ఎటుపోతున్నా నీధ్యాసే
నీన్నే తలస్తూ నీకోసమే ఆలోచీస్తూ నాప్రాణాన్ని విడుస్తా ప్రియా..!న
Saturday, September 3, 2011
ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
ఏనాటి నేరమో ఈనాటి ఓటమి ....
మనసు ఆడిన ఆటలో నేనేమో ఒంటరి.....
ఆశతోనే నేను అంతరించి పోతాను..
ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను...
ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...
నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...
మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను...
ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను.
Thursday, September 1, 2011
కన్నీటి రుచి చూపించావు...?
చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు;
తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు;
కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు;
కడదాక తోడుంటా నన్నావు;
కన్నీటి రుచి చూపించావు;
నేను లేకుండా నువ్వు సుఖంగా ఉంటానను కుంటున్నావు;
కాని ఏదో ఒక రోజు నువ్వు తెలుసు కుంటావు,
నా అంత ప్రేమ నీకు ఎక్కడా దొరకదని, నన్ను నిజంగా కోల్పోయానని
Tuesday, August 30, 2011
నీ కోసం ఒక హృదయం పరితపిస్తూ ఉంటుందని...
మూగబోయి మాటరాక మనస్సులో మాట చెప్పలేక
గుండె బారం మోయలేక వ్రాస్తున్నా నేనీలేఖ
ఏమని మోదలుపెట్టను నేస్తం నీకోసమని వ్రాస్తున్న ఈ గేయాన్ని
ఏ పూలరెక్కల్ని చిదిమి పరువను నువ్వొస్తున్న ఆ రహదారిని
ఏ గాన మేళాన్ని అడుగను నీ కోసమే ఆలపించమని
నీ స్నేహ హస్తాన్ని అందించు - చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపించు - సప్త సంద్రాలైనా దాటొస్తా
నీ హృదయంలో కాస్త చోటిపించు - ఈ జగాన్నంతా ఏలేస్తా
నువ్వు అడిగావంటే చాలు - నా ప్రాణానైనా ఇచ్చేస్తా
ఎన్నాళైనా - ఎన్నేళైనా
ఇప్పటికి - ఎప్పటికి
నీ కోసం ఒక హృదయం పరితపిస్తూ ఉంటుందనిమరచిపోవు కదా నేస్తం.......................
Saturday, August 27, 2011
నేను ఎందుకు ఇంతలా నిను ప్రేమిస్తున్నానో... మాటల్లో చెప్పలేను...
నేను ఎందుకు ఇంతలా నిను ప్రేమిస్తున్నానో...
మాటల్లో చెప్పలేను... నీకు చూపించనూ లేను...
నీవు చిందించిన చిరునవ్వులు, నీవు చూపించిన ఆప్యాయత, అనురాగం..
ఇంకా నను వీడలేదు, అవి నేను మరువనూ లేదు.
మనం కలిసినప్పుడు... ఒక స్నేహబంధం..
భావాలు పంచుకున్నప్పుడు... ఒక ఆత్మీయబంధం.
కలసి బ్రతకాలి అనుకున్నప్పుడు... ఒక అనురాగబంధం.
కానీ, నేనే.. నీవు నాపై వుంచిన నమ్మకాన్ని, ఆసరాగా చేసుకుని,
ఆ బంధాలని, నిన్ను దూరం చేసుకున్నాను, దూరంగా అంటే ... ఎల్లప్పటికీ...
నీవు దూరం అయ్యావు కానీ.. నీ తలపులు ఏ క్షణమూ నను వీడలేదు..
ఒంటరిగా తిరుగుతున్నా అప్పుడపుడూ.. తెలియకుండానే! నిను పిలుస్తూ...వుంటే..
నీ సమాధానం రాక.. ఓ కన్నీటి చుక్క రాలి.. నను ఓదారుస్తుంది...
అందరూ వున్నా.. ఏదో .. ఒంటరి ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా..
అన్నీ వున్నా .. ఏదీ లేనట్టుగా.. అంతా శూన్యంలో జీవిస్తున్నాను...
అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది.. నీవు లేని...నీ ప్రేమ లేని
ఇలాంటి నా ఈ జీవితం జీవించే కన్నా......... చనిపొతే బాగుంటుందేమో! అని,
నీ ముందు, నా మోకాళ్ళపై నుంచుని నిన్ను అర్ధిస్థున్నా!!
చెప్పు నేను ఏమి చెయ్యలి.....????
ఆ రోజులు తిరిగి రావటానికి! తిరిగి నీ ప్రేమ గెలవడానికి .
Saturday, August 20, 2011
Monday, July 4, 2011
Sunday, July 3, 2011
Subscribe to:
Posts (Atom)



.jpg)

.jpg)
.jpg)

.jpg)
.jpg)





.jpg)



