ఒక్కసారి నాకోసం రావా నేస్తమా..!!!
తిరిగి రాలేని గతమై
ఘనీభవించిన దూరంలా నువ్వు..!
మరలి రాలేని అలతో
నిరాశ చెందిన తీరంలా నేను
నిజంగా రావా నేస్తమా..!
నీ గుర్తులనే శంఖంలో
నా ఊపిరిని దాచుకొని
అచేతనమైన ఇసుక తీరాన్నై
ప్రతి రేణువులో నిస్తేజాన్ని మోస్తున్నా..!
తెలిసికూడా తిరిగి రావా నేస్తమా...!
No comments:
Post a Comment