Friday, March 9, 2012

పెళ్లి అయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటిపేరు మారుతుంది కానీ మనసెందుకు మారదు...!!!


ఆడపిల్లకి పెళ్లి అయితే చాలా మారతాయి..


పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మీషన్లు,
ప్రతిదానికి కారణాలు, సంజాయిషీలు...


ఒక్కోసారి అనిపిస్తుంది  నావాళ్లను చూడడానికి నాకిన్ని ఆంక్షలా...!!


నాకు ఒక్క విషయం అర్ధం కాదు..
ఆడపిల్లను బయటకు పంపించాలంటే పక్కనే ఒక 
చిన్న పిల్లవాడినైనా తోడిచ్చి పంపుతారు.
ఏదైనా సినిమాకు వెళ్ళాలంటే తెలిసున్న వాళ్లతోనే వెళ్లమంటారు.
వేరే ఊరిలో చదివించాల్సివస్తే హాస్టల్ లోనో, రూంలోనో పెట్టేకంటే
తెలిసినవాళ్ల ఇంట్లో పెడతారు.


ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలిసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే
పెద్దవాళ్లు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియనివాడిని 
ఎవడినో తీసుకువచ్చి, లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టపెడతారు.
అతనితో కలిసి ఏడు అడుగులు నడిచాక వెనక్కు తిరిగి చూస్తే 
మన వాళ్ల నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది.
ఆరోజు నుంచి మనం కలలుకనే హక్కుని కోల్పోతాం.
    కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం...!


పెళ్లి అయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది,
ఇంటిపేరు మారుతుంది కానీ మనసెందుకు మారదు...!!!
                                 
                         -త్రివిక్రమ్ శ్రీనివాస్(నువ్వు నాకు నచ్చావ్..!)

No comments:

Post a Comment