Monday, May 9, 2011

దేశమే ఒక పుణ్యభూమి, ఒక తీర్ధయాత్రాస్థలం!"...



నేను విదేశాలనుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆంగ్లేయ 
స్నేహితుడు,"స్వామీ! విలాసవంతమైన,తేజోవంతమైన, 
శక్తివంతమైన ఈ పాశ్చాత్య దేశాలలో నాలుగేళ్ళపాటు 
వున్న తరువాత,ఇప్పుడు మీ జన్మభూమిని గురుంచి మీరు
ఏమనుకుంటున్నారు?"అని  ప్రశ్నించాడు. నేను దానికిలా 
మాత్రమే జవాబివ్వగలిగాను: " నేను ఇక్కడికి 
వచ్చేముందు భారతదేశాన్ని ప్రేమించాను. కానీ 
ఇప్పుడు నాకు ఆ దేశపు దుమ్ముకూడా పరమపవిత్రంగా 
తోస్తున్నది. అక్కడి గాలికూడా నాకు పవిత్రంగా 
తోస్తున్నది. ఇప్పుడు నాకు ఆ దేశమే ఒక పుణ్యభూమి,
ఒక తీర్ధయాత్రాస్థలం!"...
                                      స్వామి వివేకానంద... 

ఒక ఆదర్శాన్ని కలిగివుండడం మంచిది.


ఏదో ఒక ఆదర్శాన్ని కలిగివున్న వ్యక్తి వెయ్యి 
పొరపాట్లు చేస్తే, ఏ అదర్శమూ  లేనివాడు యాభైవేల
పొరపాట్లు  చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను.
కాబట్టి , ఒక ఆదర్శాన్ని కలిగివుండడం మంచిది..
                                                                          స్వామి వివేకానంద.. 

Saturday, April 30, 2011

కిరణ్ కుమార్. వాకాడ: పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరు...

కిరణ్ కుమార్. వాకాడ: పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరు...: "పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చెయ్యడం. ఎవడైతే పేదవాడిలో, బలహీనుడిలో , రోగిలో శివుడ్ని చూడగలుగుతాడో అతడే ని..."

పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం


పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా 
ఉండడం, ఇతరులకు మంచి చెయ్యడం. 
ఎవడైతే  పేదవాడిలో, బలహీనుడిలో , రోగిలో 
 శివుడ్ని చూడగలుగుతాడో
అతడే నిజంగా శివుడ్ని అర్చిస్తాడు; ఎవడైతే
విగ్రహంలో మాత్రమే శివుడ్ని చూస్తాడో, అతడి ఆరాధన 
ఇంకా ప్రాధమికమైనదే...     

Wednesday, April 27, 2011


ఏదో ఉన్నత స్థానంలో కూర్చుని ఐదు ఫైసలు
చేతబుచ్చుకొని, " పేదవాడా ఇదిగో" అనవద్దు.
దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతనొకడు ఉన్నందుకు 
అతడి పట్ల కృతజ్ఞుడవై ఉండు. ధన్యత దాతకేగాని దానం 
పుచ్చుకున్న వ్యక్తికి కాదు.నీ ఔదార్యాన్ని,నీ దయాగుణాన్ని 
లోకంలో అమలుపరిచి తద్వార  నువ్వు పవిత్రుడవై, పరిపూర్ణతను 
సంతరించుకోవడానికి నీకు అవకాశం లబించినందుకు 
కృతజ్ఞుడవవు..

Saturday, April 23, 2011

స్వామి వివేకానంద......



నీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్దతలు,
ఎన్ని మహిమలు దాగున్నాయో నీకు తెలుసా? మనిషిలో 
ఉన్న సర్వమూ తెలిసిన శాస్త్రవేత ఎవడున్నాడు? మానవుడు 
ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి.
అయినా అతడి శక్తులలో అణుమాత్రమే ఇప్పటికి బహిర్గతమయింది.
కనుక 'నేను దుర్బలుడిని' అనకూడదు. ఫైఫైన
కానవచ్చే అధఃకరణం అడుగున మరుగుపడి ఎంత మహత్వం 
అణిగివుందో నీ కెలా తెలుస్తుంది? నీలో అణగివున్న 
మహత్వాన్ని గూర్చి నీకు తెలిసింది అత్యల్పం. 
నీ వెనుక అనంత సముద్రం ఉంది.........
      


మానవ చరిత్ర నంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు  
చేసిన స్త్రీ, పురుషుల జీవితాలలో అన్నింటికన్నా ఎక్కువగా 
సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి, వారి ఆత్మవిశ్వాసమే అని 
తెలుస్తుంది. తాము ఘనులమనే విశ్వాసంతో వారు జన్మించారు.
ఘనులే అయ్యారు.............. 
   


విశ్వంలోని సర్వశక్తులూ మనలోనే ఉన్నాయి.
స్వయంగా మన కళ్లను మనమే చేతులతో మూసుకొని 
చీకటిగా ఉందని విలపిస్తున్నాం.మనలను చీకటి 
ఆవహించలేదని గ్రహించండి. చేతులను తొలగించి వేయండి.
ప్రారంభం నుంచి ఉన్నవెలుగు గోచరిస్తుంది.ఎన్నడూ
చీకటి లేదు, దుర్భలత లేదు. మనమే  వెర్రి వాళ్ళమై
దుర్భలురమని వాపోతున్నాం;మనమే మూర్ఖులమై
అపవిత్రులమని విలపిస్తున్నాం..  

Tuesday, March 15, 2011

కిరణ్ కుమార్. వాకాడ: స్వామి వివేకానంద

కిరణ్ కుమార్. వాకాడ: స్వామి వివేకానంద: "అపజయాలను లక్ష్య పెట్టకండి. అవి సహజం,అవి జీవితానికి అందం చేకూరుస్తాయి. అవి లేని జీవితం ఎలా వుంటుంది ? ఈ పోరాటాలే జీవితానికి స్వార..."

స్వామి వివేకానంద



అపజయాలను లక్ష్య పెట్టకండి. అవి సహజం,
అవి జీవితానికి  అందం చేకూరుస్తాయి. అవి లేని జీవితం 
ఎలా వుంటుంది ? ఈ పోరాటాలే జీవితానికి స్వారస్యమిచ్చేవి.
అవి లేకుంటే జీవిత కవితామాదుర్యం ఎక్కడవుంటుంది  ?
ఈ పోరాటాలనూ, పొరపాట్లనూ లక్ష్యపెట్టవద్దు.
అపజయాలచే నిరుత్శాహం  చెందకండి ..
ఆదర్శాన్ని చేగొని వెయ్యిసార్లు ప్రయత్నించండి.
వెయ్యిసార్లు ఓటమి చవిచుసినా  ఇంకోసారి  ప్రయత్నించండి....