Tuesday, August 14, 2012
Friday, March 9, 2012
పెళ్లి అయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటిపేరు మారుతుంది కానీ మనసెందుకు మారదు...!!!
పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మీషన్లు,
ప్రతిదానికి కారణాలు, సంజాయిషీలు...
ఒక్కోసారి అనిపిస్తుంది నావాళ్లను చూడడానికి నాకిన్ని ఆంక్షలా...!!
నాకు ఒక్క విషయం అర్ధం కాదు..
ఆడపిల్లను బయటకు పంపించాలంటే పక్కనే ఒక
చిన్న పిల్లవాడినైనా తోడిచ్చి పంపుతారు.
ఏదైనా సినిమాకు వెళ్ళాలంటే తెలిసున్న వాళ్లతోనే వెళ్లమంటారు.
వేరే ఊరిలో చదివించాల్సివస్తే హాస్టల్ లోనో, రూంలోనో పెట్టేకంటే
తెలిసినవాళ్ల ఇంట్లో పెడతారు.
ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలిసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే
పెద్దవాళ్లు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియనివాడిని
ఎవడినో తీసుకువచ్చి, లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టపెడతారు.
అతనితో కలిసి ఏడు అడుగులు నడిచాక వెనక్కు తిరిగి చూస్తే
మన వాళ్ల నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది.
ఆరోజు నుంచి మనం కలలుకనే హక్కుని కోల్పోతాం.
కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం...!
పెళ్లి అయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది,
ఇంటిపేరు మారుతుంది కానీ మనసెందుకు మారదు...!!!
-త్రివిక్రమ్ శ్రీనివాస్(నువ్వు నాకు నచ్చావ్..!)

Thursday, March 8, 2012
చిరునవ్వుతో సినిమాలోని అద్భుతమైన డైలాగ్ మీ కోసం...!!!
ఎంతసేపు ఆడపిల్లలని తలదించుకొని కాలేజీకి వెళ్ళమనే తల్లితండ్రులే కానీ
కనీసం ఇంట్లో అయినా తలెత్తి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్లు ఎంతమంది..?
అందుకే కొడుకు సిగెరెట్లు తాగే విషయం కిళ్ళీకొట్టు వాడు
బాకీ అడిగే వరకు తెలియదు.
కూతురు ఎవర్నో ప్రేమించిన విషయం, వాడితో ఏ మార్నింగ్ షో లో
కనిపించేంతవరకూ తల్లికి తెలియదు..
తల్లితండ్రులకు,పిల్లలకు మధ్యన సరైన అవగాహన ఉంటే
ఏ ఆడపిల్ల పెళ్లిపీటల మీద నుంచి లేచిపోదు..
కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు.
మోసపోయి తిరిగి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
ఋషి సినిమాలోని అద్భుతమైన కవిత మీ కోసం...!!!
నిన్నలన్నీ తెలిసిన సమయమా
కదలక నిలిచిపోవా కాసేపు
కనులను వదిలిపోయే చూపులతో
కనులారా తనని చూడాలి .
మనసారా మాట్లాడాలి.
సంపూర్ణమైనది నా జీవితం
ఆకాశమంత ఆనందంతో
ఈ ఆనందానికి రూపం నువ్వే.
నా జేవితనికి అర్ధం నువ్వే..
ఈ సాగరాన ఎగిసే కెరటాలు
నా హృదయాన మధుర జ్ఞాపకాలు
ఇంతటి సంతోషాన్ని కానుక చేసింది నువ్వే..!
ఒడిలో తనవాడినై, పసివాడినై
అడుగడుగునా, ప్రతిఅడుగునా
నేను తనలోనే ఉన్నాను,తన తోటే ఉంటాను.
ఇప్పటికీ...ఎప్పటికీ...
ఒక స్వాప్నికుడిగా...తన ప్రేమికుడిగా...!
ఆడ పిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం ఇంకోటి లేదురా...!!
అందరూ నవ మాసాలు మోసే తల్లి గురుంచి మాట్లాడుతారు కాని
ఆ పుట్టిన పిల్లలకి పాలడబ్బాల దగ్గరినుంచి పెళ్లి మండపం
దాకా తీసుకెళ్ళే తండ్రి గురుంచి ఎవ్వరూ మాట్లాడరు.
ఆడపిల్లలు...!
పుడుతూనే వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకుని వెళ్లిపోతూ మనల్నిఏడిపిస్తారు..
అబ్బు-ఒక ఆడపిల్లను కను.
అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసే చప్పుడు విను.
దానికి ఒక 16 యేళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డుమీద
వెళ్లే కుర్రాళ్ల దొంగ చూపులు చూడు.
ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని
గర్వంతో పొంగిపోయే నీ మనస్సుని అడుగు...
కూతుర్ని కానీ పెంచడంలో వుండే కిక్కు తెలుస్తుంది.

Subscribe to:
Posts (Atom)