Monday, April 8, 2013

ఈ భావాన్ని నా మనస్సులో నిలుపుకొని నేను ప న్నెండేళ్లు పయనించాను.


   దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికి 
   ఎదురుచూస్తే, అది వచ్చే తీరుతుంది. 

    ఈ భారాన్ని నా హృదయంలో మోస్తూ,
    ఈ భావాన్ని నా మనస్సులో నిలుపుకొని 
    నేను ప న్నెండేళ్లు పయనించాను. 

    ధనవంతులనబడే, ఘనులనబడే వారి 
     ఇంటింటికీ నేను వెళ్ళాను. 
     రక్తం స్రవిస్తున్న హృదయంతో 
     ప్రపంచంలో సగం భాగాన్ని దాటి 
     ఈ అన్య దేశానికి(అమెరికా ) సహాయార్ధం వచ్చాను. 

     భగవంతుడు మహిమాన్వితుడు. 
     ఆయన సహాయం చేస్తాడని నాకు తెలుసు.    
     ఈ దేశంలో చలిని లేదా ఆకలిని తట్టుకోలేక 
     నేను నశించిపోవచ్చు. 

     కాని యువకులారా.... 
     పేదల,అజ్ఞానుల,పీడితుల  పట్ల
     చూపవలిసిన సానుభూతిని మీకు సంక్రమింపచేస్తున్నాను...!!
                

దరిద్రునిలో శివుణ్ణి చూడగలిగిన వ్యక్తి నిజమైన శివారాధకుడు..!!



      పవిత్రంగా ఉంటూ ఇతరులకు మేలు చేయడమే 
     అన్ని ఉపాసనల సారం ..!

       దరిద్రునిలో, రోగిలో శివుణ్ణి చూడగలిగిన 
       వ్యక్తి నిజమైన శివారాధకుడు..!!
       విగ్రహంలో మాత్రమే శివుణ్ణి చూడగలిగే 
        వ్యక్తి ఆరాధన ప్రారంభ దశలోనిదే....!!
    

Thursday, April 4, 2013

ఆ ఆవేదనలోనే ఆనందం వెతుకుతుంటాం ...!



   ఎందుకో అర్ధం కాదు,
   మనం అంటే పట్టని వాళ్ళ  గురించే
       ఎక్కువ ఆలోచిస్తాం...

  మన తోడు కావాలనుకునే వాళ్ళని
  దూరం చేసుకుంటాం..

   బంధం అయినా, బాధ్యత అయినా 
   ఆ ఆవేదనలోనే  ఆనందం  వెతుకుతుంటాం ...!


  

Monday, April 1, 2013

ఇక నాకెక్కడ చోటుంది అని ....!!!


నా కనుపాప నుండి జారిపడుతున్న 
కన్నీటి చుక్కను అడిగెను  నా మనసు 
ఎందుకు నిశబ్దంగా జారుతున్నావు అని...!

అప్పుడు కన్నీటి చుక్క చెప్పెను 
నీ కనుల నిండా నీ నేస్తం ఉండగా 
ఇక నాకెక్కడ చోటుంది అని ....!!!




కొందరి నీడలో కాలాన్నే మరచిపోతాము...!!!




        కాలం నీడలో కొందరిని మరచిపోతాము...!
         
                     కొందరి  నీడలో కాలాన్నే మరచిపోతాము...!!!

Sunday, March 17, 2013

ఇక సెలవు మిత్రమా....!!





  నిజంగా మన ఎడబాటు నీకు సంతోషాన్ని కలిగిస్తుంది అంటే .....
               
                    అంతకంటే నేను కోరుకునేది ఏమిలేదు మిత్రమా.....!!!

      ఇక సెలవు మిత్రమా...!!!







   
          కనులు కలలను మరచిపోవు..
          ఊపిరి శ్వాసను మరచిపోదు..
          వెన్నెల  చంద్రుడిని మరచిపోదు..
          నా  మనసు నీ స్నేహాన్ని మరచిపోదు..
       
           విరిసిన వెన్నల కరిగిపోతుంది..
           వికసించిన పువ్వు వాడిపోతుంది..
           కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది ...!

           వద్దన్నా వచ్చేది మరణం..
           పోవద్దన్నా పోయేది ప్రాణం..
           తిరిగి రానిది బాల్యం..
           మరువలేనిది మన స్నేహం..
           కుల మత భేదం లేనిది..
           తర తమ భావం రానిది..
           ఆత్మార్పణమే కోరుకునేది...
           ప్రతిఫలమన్నది ఎరుగనిది నీ స్నేహం .....!!!

Tuesday, August 14, 2012

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు ...!!



బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  అందరికి శుభాకాంక్షలు ...!!           

Sunday, April 15, 2012

Friday, March 9, 2012

నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే జరిగేదే ఒక అద్భుతసృష్టి..


ప్రియా...!
 నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే
జరిగేదే ఒక అద్భుతసృష్టి..
దానికి విధి, కధ రాసే బ్రహ్మను నేనే..!
ఆ ఊహే మధురంగా ఉంటుంది.
పిచ్చిగానూ ఉంటుంది    
కానీ అంత పెద్ద బ్రహ్మ(నేను) కూడానూ 
ఒక చిన్ని కన్నీటి చుక్కకే కొట్టుకుపోతాడు..!