Sunday, October 23, 2011

జనాభాపరంగా పెద్ద నగరాలు ఇవట..!

 భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌లోని నగరాల 2011 జనాభా లెక్కల వివరాలు చూసి రాస్తున్న పోస్టిది..! చిన్నప్పట్నుంచీఆ ఊరు పెద్దదా..ఈ ఊరు పెద్దదా..అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడినిఇప్పటికీ ఉన్న ఆ వెర్రి కారణంగా ఈ పోస్ట్‌ రాస్తున్నాను.

                                                                                              
నగరం
జనాభా
ముంబయి (Mumbai)
18,414,288
దిల్లీ (Delhi)
16,314,838
కోల్‌కత (Kolkata)
14,112,536
చెన్నై (Chennai)
8,696,010
బెంగుళూరు (Bengaluru)
8,499,399
హైదరాబాద్‌ (Hyderabad)
7,749,334
అహ్మదాబాద్‌ (Ahmadabad)
6,352,254
పూణే (Pune)
5,049,968
సూరత్‌ (Surat)
4,585,367
జయపూర్‌ (Jaipur)
3,073,350
కాన్పూర్‌ (Kanpur)
2,920,067

రాష్ట్రంలో..

నగరం
జనాభా
హైదరాబాద్‌
7,749,334
విశాఖపట్టణం
1,730,320
విజయవాడ
1,491,202
వరంగల్లు
759,594
గుంటూరు
673,952
నెల్లూరు
564,148
రాజమండ్రి
478,199
కర్నూలు
478,124
తిరుపతి
459,985
కాకినాడ
442,936

సకలజనులారా! ఇప్పటికైనా కళ్ళు తెరవండి!


సకలజనులారా !
 మీ త్యాగాల ఖరీదు ప్రస్తుతానికి, వందల  కోట్ల రూపాయల పోలవరం కాంట్రాక్టులు.
 మీ త్యాగాల ఖరీదు రాబోయే ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలు.    
 మీ త్యాగాల ఖరీదు - కేంద్ర , రాష్ట్ర , మంత్రి పదవులూ ---  కాంట్రాక్టులూ - దోపీడూలూ- కుంభ కోణాలూ.  
ఇప్పటికైనా గుర్తించారా మీ ఉద్యమ బలహీనతలేమిటో?
మీ ఉద్యమ ప్రధాన బలహీనత మీ ప్రధాన నాయకుడు కేసియారూ అతడి కుటుంబమే.
     సోనియా గాంధీతో కలిసి కేసీయార్ ఆడుతున్న డ్రామా ఇంకా మీకూ ,మీ జేఏసీ నాయకులకి తెలియదనుకోవాలా? సకలజనుల సమ్మె కు కొద్దిరోజుల ముందు మీ కేసీయార్ "2014 ఎన్నికల వరకూ తెలంగాణా వచ్చేటట్టు లేదు" అని చెప్పినప్పుడే మాకందరికీ అర్ధమయింది. మీకింకా అర్ధం కాలేదంటే మీరు నిజంగా ...... .... 
     కోతినాడించి బతికే  వాడి బతుకు ఆ కోతి బతికున్నంతసేపే . అందుకే వాడు దాన్ని చావనివ్వడు, అలాగని బలవనివ్వడు. అది బలిస్తే తనని పీకేస్తుందని తెలుసు.  అందుకే అంత గ్యారంటీగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తాను కాపలా కుక్క లా ఉంటానని చెపుతున్నాడు.  కేసీయార్ చచ్చేదాకా తెలంగాణా రాదనీ, రానివ్వడనీ ఇప్పటికైనా తెలుసుకొండి!
     ఇంత కాలంగా ఉద్యమం జరుగుతున్నా, మీరు మీ రాజకీయ నాయకులందరినీ ఒక్క తాటి మీదకు తేలేకపోయారు, పైగా ఇది సీమాంధ్రుల కుట్ర అంటూ బురద జల్లుతారు. మీ తెలంగాణలోజై తెలంగాణా అంటూ , ఎమ్మెల్యేలుగా మంత్రులుగా  ప్రభుత్వంలో  ఉంటూ, అధికారాల్ని అనుభవిస్తూ, దొంగ బతుకు బతుకుతున్న వారిని వదిలేసి , సీమాంధ్ర నాయకుల్ని టార్గెట్ గా చేసుకోవడం సిగ్గుగా అనిపించడం లేదూ ? 
   మీ మంత్రులు దానం , ముఖేష్ , జానా వగైరాల మీద కి వెళ్ళగలరా? ఓవైసీల వెంట్రుకైనా పీకగాలరా ?   చూసారుగా దానం మీదికేల్తే ఏం జరిగిందో ?  
     గత కొన్ని సంవత్సరాలుగా మీరు  మీ  నాయకులు ఎలా ఆడమంటే అలా ఆడడమే గానీ ఒక్కరైనా (స్వామీ గౌడ్ తప్ప )  మీ నాయకుల్ని నిలదీయ గలిగారా ?
 మీ నాయకుల్ని నిలదీయడం ,  ఐక్యం చెయ్యలేక  పోవడమే మీ బలహీనత.


మీరు చేస్తున్న రాస్తా రోకోలు , బందులు ,జనజీవనాన్ని ఎంత అస్తవ్యస్తం చేస్తున్నాయో మీకు అనుభవిస్తేనే గానీ తెలియదు. రెక్కాడితే గాని డొక్కాడని రోజుకూలీలు ఏమైపోతున్నారో ఎవరైనా పట్టించుకున్నారా ? ఉద్యోగులకి వడ్డీతో జీతాలిచ్చేస్తానంటున్న కేసీయార్ వీళ్ళకేం సమాధానం చెపుతాడు?
అసలు మీ జేఏసీ లు సమ్మె ఏ డిమాండు తో మొదలెట్టాయి ? ఏ డిమాండ్లు సాధించుకుని విరమిస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని స్వంత డిమాండ్లు సాధించు కుంటున్న వారిని కనిపెట్టండి. 

Tuesday, September 27, 2011

ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్


డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న ఆరోపణలపై సి.బి.ఐ తాజా విచారణకు నిర్ణయించింది.
ఈ విషయంలో సి.బి.ఐకి నాలుగు సంవత్సరాల క్రితమే ఫిర్యాదులు అందుకున్నప్పటికీ, సి.బి.ఐ విచారణను ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. 2007లోనే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని టెలికం సెక్రటరీకి సిఫార్సు చేసినప్పటికీ టెలికం డిపార్ట్‌మెంటు అందుకు ఆమోదం తెలపలేదు. దానితో అది అక్కడితో ముగిసిపోయింది. సి.బి.ఐ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులపై ప్రాధమిక విచారణ దాఖలు చేయడానికి నిర్ణయించుకున్నదని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
దయానిధి మారన్‌ ఇంటికి వేసిన 323 టెలిఫోన్ లైన్లు వాస్తవానికి ఆయన ఇంటికి ఉద్దేశించినవి కావనీ, అవి చట్ట విరుద్ధంగా ఆయన సోదరుడు యజమానిగా ఉన్న టెలివిజన్ ఛానెల్ వినియోగానికి ఉద్దేశించినవని సి.బి.ఐ వెల్లడించింది. 323 టెలిఫోన్ లైన్లన్నీ బి.ఎస్.ఎన్.ఎల్ జనరల్ మేనేజర్ పేరుమీద ఉన్నాయని సి.బి.ఐ కనుగొంది. దయానిధి మారన్ కి చెందిన బోట్ హౌస్ నివాసం నుండి సన్ టివి కార్యాలయానికి కలుపుతూ కూడా లైన్లు వేశారని కనుగొంది. కేవలం సన్ టి.వి వినియోగం కోసమే అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారని వెల్లడించింది.

దయానిధి మారన్ బి.ఎస్.ఎన్.ఎల్ నుండి తన ఇంటికీ, అక్కడి నుండి టి.వి కార్యాలయానికి వేయించుకున్న కేబుల్స్ సాధారణమైనవి కావనీ, అత్యంత ఖరీదైన ఐ.ఎస్.డి.ఎన్ కేబుల్స్ అనీ ఇవి భారీగా డేటాను మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగి ఉన్నవనీ సి.బి.ఐ కనుగొంది. వాటి ద్వారా సన్ టి.వి అందజేసే వార్తా ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు అత్యంత వేగంగా అన్ని దేశాలకు ప్రసారం కావడానికి ఏర్పాట్లు చేసుకున్నారని సి.బి.ఐ ప్రాధమిక విచారణలో కనుగొన్నది.
ఈ కేబుల్స్ ను సాధారణంగా మధ్య తరహా నుండి భారీ వాణిజ్య సంస్ధల ప్రత్యేక అవసరాల నిమిత్తం వాడతారని సి.బి.ఐ తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్, పెద్ద మొత్తంలో డిజిటల్ డేటాను ప్రసారం చేయడం లాంటి ముఖ్యమైన అవసరాలకు ఈ కేబుల్స్ వినియోగిస్తారని అందువలన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించవలసి ఉంటుందనీ సి.బి.ఐ పేర్కొంది. కాని మారన్ సిఫారసులతో సన్ టి.వికి ఉచితంగా ఇవి లభించాయని సి.బి.ఐ ఆరోపించింది.
అధికారాలు అప్పగించబడిన పరిమిత బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది తప్ప ఈ కేబుల్స్ కనుగొనలేని విధంగా ఈ కేబుల్స్‌తో కూడిన ఎక్ఛేంజ్ ను ప్రోగ్రాం చేయించారని, టెలికం కంపెనీలో ఇంకెవరూ వీటి ఉనికిని కనుగొనడానికి వీలు లేకుండా చేసుకున్నారని సి.బి.ఐ తెలిపింది. మంత్రిగారి నివాసాన్నీ, సన్ టెలివిజన్ కార్యాలాయాన్ని కలుపుతూ స్టెల్త్ కేబుల్ వేయించుకున్నారని సి.బి.ఐ ఆరోపించింది. తద్వారా మంత్రికోసమే ఈ కేబుల్స్ వేయించుకున్నట్లుగా అభిప్రాయం కలుగజేయడానికి ప్రయత్నించారని వాస్తవానికి ఇవి టి.వి ఛానెల్ వినియోగానికే వేశారని తెలిపింది.
దీనిని బట్టి కరుణానిధి, దయానిధి మారన్ ల కుటుంబాలు తమ ఇస్టానుసారంగా దేశ ప్రజలకు చెందిన టెలికం వనరులను వాడుకుని సొమ్ము చేసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ దురాగతాలన్నింటినీ కూటమి ధర్మం మాటున ప్రధాని తదితరులు కొనసాగడానికి అనుమతినిచ్చారని సి.బి.ఐ దర్యాప్తులోనూ, ఆర్.టి.ఐ చట్టం ద్వారానూ వెలుగులోకి వస్తున్నది. అయితే ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగించి ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, దయానిధి మారన్ లాంటి పెద్ద తలకాయలు రాసిన నోట్ లను బైటపెట్టగలగడం అంత తేలికగా జరిగే పని కాదు. ప్రభుత్వంలోనే మంత్రుల మధ్య తలెత్తే విభేదాలు ఒకరినొకరు కుత్తుకులు ఉత్తరించుకునే స్ధాయికి చేరుకోవడంతోనే ఈ మాత్రం వెల్లడి అవుతున్నాయని భావించవచ్చు.

మనం చూసి ఉండని సముద్ర ప్రాణులు...ఫోటోలు














బి.ఎస్.ఎన్.ఎల్ లో లక్ష మందికి స్వచ్చంద పదవీ విరమణ


సెప్టెంబర్ 27 న ధర్నాఅక్టోబర్ 10 న సమ్మె ఉద్యోగులు
2009 లో 3,97,000 మంది ఉద్యోగులుండేవాళ్ళు. ప్రస్తుతం 276,000 మంది పనిచేస్తున్నారు. అంటే లక్షా ఇరవై వేలమందికి పైగా తగ్గారు. కారణం రిటైరైన వాళ్ళ స్తానంలో నియామకాలు నిలపటమే. అయినా ఇది ప్రభుత్వానికి చాలలేదు. మరో లక్షమందిని ఇంటికి పంపాలని మంకుపట్టుతో ఉంది. 2000 నుంచీ 2009 దాకా లాభాలలోనే నడిచింది. తొలిసారి 2009-2010 సంవత్సరంలో ప్రభుత్వ విధానాల మూలంగా 1823 కోట్లు నష్టం నమోదు చేసింది. 2010-2011 లో నష్టం 6384 కోట్లు. ఉద్యోగుల జీతాల వల్లే నష్టాలంటూ ప్రభుత్వమూయాజమాన్యమూ ప్రచారం చేస్తున్నాయి.2009-2010 లో ఆదాయంలో 42 శాతం జీతాలకి ఖర్చయిందనీ, 2010-11 లో 46.5శాతం అనీ ,ప్రైవేట్ కంపెనీలకి 5శాతం మాత్రమే అవుతుందనీ వాదన. ప్రస్తుతం 49 శాతం అని ఆర్.కే. ఉపాధ్యాయ బి.ఎస్.ఎన్.ఎల్ చైర్మన్ 2011 ఆగస్ట్ చివరలో ప్ర ప్రకటించాడు . ఇదే పెద్ద సమస్య అన్నాడు. ఎయిర్‌టెల్ లో 25,000 మంది మాత్రమే పనిచేస్తున్నారనీ,పైగా ఆసంస్తకి బీ.ఎస్.ఎన్.ఎల్ కన్నా ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారనీ కనక ఇందులో ఉద్యోగుల్ని తగ్గించాలనీ పట్టుబడుతున్నారు.
45 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులు. ఒక లక్షమందికి ఈప్రతిపాదన వర్తిస్తుంది. మొత్తం ఖర్చు 20,802 కోట్లు.ఇందులో బి.ఎస్.ఎన్.ఎల్ వాటా 2705 కోట్లు. పోగా 18,097 కోట్లు డాట్ వాటా. ఒక ఉద్యోగికి సగటున వచ్చేది 20.8 లక్షలు. పనిచేసిన సంవత్సరానికి రెణ్ణెల్ల జీతం చొప్పున వచ్చే మొత్తం గానీమిగిలిన సర్వీసుకు రావలసిన జీతం మొత్తం గానీ - రెంటిలో ఏది తక్కువయితే అది వస్తుంది. మీకిది లాభదాయకం అంటూ ఉద్యోగుల్ని ఊరిస్తున్నది. శాం పిట్రోడా సిఫారస్ ప్రకారం లక్షమందిని తగ్గించాలని ప్రభుత్వ పట్టుదల.
సరే లక్షతొ ఆగుతుందాఎయిర్ టెల్ 25000 మందితో నడుస్తున్నప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్ ఎందుకు నడవదుఅనేది తర్వాత ప్రస్న కాదా? 25 వేలకి కుదించే కార్యక్రమం అంచెలంచెలుగా కొనసాగదని గారెంటీ ఏమిటిఅలా చేసినా చాలదు. పోటీ సంస్తకి లాగే జీతాల ఖర్చు శాతాని తేవాలనే కోరిక పుట్టదాచౌకగా దొరికే వాళ్ళతో పనిచేయించుకుని లాభాలు దండుకునే ప్రైవేట్ యజమానుల దుష్ట వాంఛ ప్రబుత్వాల తలకెక్కింది.
ఇష్టమైన వాళ్ళు పదవీవిరమణ పధకాన్ని వినియోగించుకోవచ్చు. బలవంతం లేదు అని యాజమాన్యం అంటున్నది కాని దాని లోగుట్టుఆంతర్యం ఉద్యోగులకు తెలుసు. ఇతర దేశాల్లో ఎమిజరిగిందో గమనించారు.యూనియన్లు సరే అంటే చాలు. సుదూర ప్రాంతాలకి బదిలీ చేసి లొంగేట్టు చేసిన సందర్భాలు విదేశీ టెలికాం రంగంలో లెక్కకు మించి ఉన్నాయి.
నయానోభయానో ఇళ్ళకుపంపి సంస్తని ప్రైవేటు కంపెనీలకి అమ్మాలనేది ఆంతర్యం. ఆ కంపెనీలనుంచి భారీస్తాయిలో ముడుపులు దండుకోవటం తెలిసిందే. పైగా సంస్తకి భారీస్తాయిలో భూములున్నాయి. వాటిని ప్రైవేటుకి చౌకగా కట్టబెట్టి అంతులేని అవినీతికి పాల్పడలన్నదే పాలకుల కోరిక. ఆఆశతోనే ఇందుకొడిగడతున్నారు.
ఈదుష్ట పధకాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరూ కలిసి సెప్టెంబర్27 న ధర్నా చేశారు. అక్టోబర్ 10 న సమ్మే చేయబోతున్నారు. ఉద్యోగులు విజయం సాధించాలని అందరం కోరుకుందాం. సహకరిద్దాం.

Saturday, September 24, 2011

‘దూకుడు’ మూవీ హిట్ పిక్చర్ గా మిగులుతుంది.... బ్లాక్ బస్టర్ మూవీ అయ్యే ఛాన్స్ లేదు..


చిత్రం: దూకుడు
నటవర్గం: మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, సోనూసూద్, నాజర్ తదితరులు
సంగీతం: తమన్
దర్శకుడు: శ్రీను వైట్ల

టూకీగా....

(హేష్ బాబు లాంటి స్టార్ హీరో విలన్స్ ని ఎదుర్కోవటానికి యాక్షన్ ని నమ్ముకోకుండా, అల్లరి నరేష్ లాగ నాటకాలాడుతూ వాళ్లను బకరాలను చేస్తూంటే ఎలా ఉంటుంది.. చూస్తున్నంతసేపూ నవ్వు వచ్చినా ఆ తర్వాత అరే.. ఇదేంటి..మనమేం చూస్తున్నాం అనిపిస్తుంది. దూకుడు చిత్రం చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. సామాన్యంగా యాక్షన్ కామిడీ లు ఎప్పుడూ సేఫ్ జోనే.. అయితే మధ్యలో ఫ్యామిలీని కూడా కలిపేసి అన్ని వర్గాలని ఆకట్టుకోవాలి అన్న ఆశే అటూ ఇటూ కాకుండా చేసేస్తుంది. మహేష్ దూకుడు కి శ్రీను వైట్ల తన టిపికల్ కామిడీతో పాటు 'అతడు' లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్, 'పోకిరి' లాంటి పోలీస్ యాక్షన్ కలపి కాక్ టెయిల్ మిక్స్ చేసి వదిలాడు. దాంతో యాక్షన్ సీన్ వచ్చిన వెంటనే కథ ప్యామిలీ ఎపిసోడ్ లోకి మారిపోయి, ఆ కాస్సేపటికే కామిడీ స్కిట్ లా రూపాంతరం చెంది, మరి కొద్దిసేపటికి రొమాన్స్ పండిస్తూంటుంది. కథలో అల్లిన ధ్రెడ్ లు ఒకదానికొకటి కలవకుండా ముందుకెళుతూంటాయి. అంతేగాక ఎప్పటిలాగే శ్రీను వైట్ల ..హీరో ఎవరైతేనేం.. కామిడీ కామన్ అన్నట్లు తన గత సినిమాల్లో పాత్రలనే మళ్ళీ రిపీట్ చేసి వదిలాడు. అవి కొన్ని సార్లు నవ్విస్తే..మరికొన్ని సార్లు ఇబ్బందిపడుతూ మనల్ని పెడతాయి. అయితే కామిడీ క్లిక్ అయితే సినిమా క్లిక్ అయ్యినట్లే అన్నది నిజమైతే ఈ దూకుడు హిట్టులోకి దూకేసినట్లే. )

 

అభిమానులు ఎన్నో ఆశలు పెట్టకున్న దూకుడు థియేటర్లలో దూకేసింది. అయిదేళ్ల తర్వాత (2006లో వచ్చిన పోకిరి తర్వాత హిట్టే లేదు కదా) అయినా మహేష్ ఆశలు, అభిమానుల కోరిక నెరవేరింది. కుర్రకారు మెచ్చిన హీరోయిన్, ఫ్యామిలీలు మెచ్చే డైరెక్టర్, టోటల్ ఆంధ్రా మెచ్చే కలిసి అద్భుతం సృష్టించారా? సెన్సార్ రిపోర్టు వచ్చినంత పాజిటివ్ గా సినిమా ఉందా అన్ని అన్ని ప్రశ్నలకు సమధానం ఈ రివ్యూ
సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తండ్రిని ప్రేమించే ఓ మంచి పోలీసు అధికారి కథ. మహేష్ బాబు. ఓ పోలీసు ఉన్నతాధికారి స్పెషల్ టీం నాయకుడు. అతను పోలీసులకు ఛాలెంజ్ గా నిలబడిన ఓ క్రిమినల్ పట్టుకోవాలి. అయితే, ఈ పోలీసు శంకరన్న (ప్రకాష్ రాజ్ – పీజేఆర్ పాత్ర అని ప్రచారం జరిగింది కానీ.. ఆ షేడ్లు మాత్రమే ఉన్నాయి) అంటే ప్రజలకు ప్రాణం వారన్నా శంకరన్నకు ప్రాణం. మంచి మనిషి. ఓ రౌడీ చేస్తున్న దందాను అడ్డుకోబోయినందుకు వాళ్లు ఆయనను లేపేస్తారు. తన లాగే ప్రజానాయకుడు అవుతాడనుకున్న శంకరన్న కొడుకు మహేష్ బాబు పోలీసు అధికారి అవుతాడు. పోలీసు డిపార్టుమెంటుకు సవాలుగా నిలిచిన గురుతల్వార్ (సోనూసూద్) ను పట్టుకునే ప్రయత్నంలో సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. గురు వేటలో కథ టర్కీకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కు వస్తుంది. ఇల్లు అద్దెకు ఇచ్చకుని నటనపై ఉన్న ఆశను నెరవేర్చుకునే బ్రహ్మానందం, సినిమాయే జీవితంగా బతికే ఎంఎస్ నారాయణల సహాయంతో (వాళ్లకు తెలియకుండానే వారిని పావులుగా వాడుకుంటూ) గురు తల్వార్ ను ఎలా పట్టుకుంటాడు అన్నదే కథ. ఇందులో ప్రధాన ట్విస్టు సోనూ హత్యా ప్రయత్నంలో కోమాలోకి వెళ్లి పద్నాలుగేళ్ల తర్వాత శంకరనారాయణ బతకడం. దీనివల్ల సినిమా మొత్తం కొత్త మలుపు తీసుకుంటుంది.
ఇక విశేషాల గురించి చెప్పాలంటే సమంత పాత్రకు ఇందులో ప్రాధాన్యం లేదు. కేవలం టర్కీలో పోలీసు ఆపరేషన్కు వెళ్లినపుడు మహేష్ కు ఆమె పరిచమయ్యే సీన్ నుంచి టర్కీలో వారిద్దరి మధ్య సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. ఇవి ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా మొదటి పావు వంతు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సీన్లు వేగంగా నడిచిపోతుంటాయి. అద్భుతంగా జాతకాలు చెప్పే శాస్త్రి (వెన్నెల కిషోర్) క్యారెక్టర్ ఫస్టాఫ్ లో అలరిస్తుంది. బ్రహ్మానందంతో చేసిన అన్ని సీన్లు పండలేదు. వాళ్ల నాన్నను సంతోషపెట్టడంలో భాగంగా మహేష్ బాబు బ్రహ్మానందం ఇంటిని, విలన్లను పట్టుకోవడానికి బ్రహ్మానందాన్ని బాగా వాడుకుంటాడు. నటనంటే పడిచచ్చే ఎంస్ నారాయణ క్యారెక్టర్ కూడా పూర్తి స్థాయిలో నవ్వించకపోయినా చాలావరకు అతను తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడితోనే ముగిసే ఆఖరి సీను నవ్విస్తుంది. ఈ సినిమాలో “కింగ్” సినిమా ట్విస్టుల విషయంలో గుర్తుకువస్తుంది. నాజర్ పాత్రతో నవ్వులు పండించడం బాగుంది. రెండో సగంలో సినిమాలో వేగం లేదు. సోనూసూద్, కోట శ్రీనివాసరావు, నాజర్, ధర్మవరపు సుబ్రమణ్యం, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు బాగా న్యాయం చేశారు. ప్రకాష్ తన పాత్ర పరిధి వరకు బాగాచేశారు. సినిమా ఆయన చుట్టూనే తిరిగినా పెద్ద పాత్రేమీ ఉండదు. అసలు ప్రకాష్ రాజ్ పాత్ర మళ్లీ బతకడంతోనే సినిమాకు సమస్యలు మొదలయ్యాయి. దీనివల్ల సాగదీత అనిపిస్తుంది. పోలీసు ఆఫీసరు పదవిని, టెక్నాలజీని వాళ్ల నాన్న కోసమే ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సుమన్, నాగబాబు పాత్రల్లో పెద్ద ఇంటెన్సిటీ లేదు. రియాలిటీ షో నటుడిగా మాత్రం బ్రహ్మానందం కొన్ని సీన్లు అదరగొట్టాడు.
పోలీసు అధికారిగా తెలంగాణ మాట్లాడే మహేష్ బాబు శంకరన్న (ప్రకాష్ రాజ్) కొడుకుగా మాత్రం మామూలు భాష మాట్లాడతాడు. ఇది అటు ఇటు అయింది. మహేష్ నోటిదూల బాగుంది. సుమన్ ను విలన్లు బంధించినపుడు మహేష్ బాబు చేసిన యాక్షన్ సీన్లు బాగా పండాయి. పాటలు సినిమాకు, ప్లస్సూ కాదు, మైనస్సూ కాదు. పార్వతి మెల్టన్ పాట మాత్రం స్కిన్ షో. దసరా సెలవులను వాడకుంటే మాత్రం కలెక్షన్లకు బెంగలేదు.
ఇందులో మహేష్ బాబు డైలాగులన్నీ అదిరిపోతాయి. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా… ఇలా మూవీ మొత్తం మంచి డైలాగులతో మహి అలరిస్తాడు.

Wednesday, September 21, 2011

భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు

భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు రు. 781/- (రు. రోజుకు 26/-) కంటే తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులను ప్రణాళికా సంఘం తెలిపింది.

Wednesday, September 14, 2011

తాకే ప్రతి అల నీ జ్ఞాపకం......!!!


    ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
సముద్ర తీరాన  ఒంటరి పయనం
తాకే ప్రతి అల నీ జ్ఞాపకం
నా కాళ్ళను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే
నీవులేని నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా........ ??


వీచే చిరుగాలి నా  మేను ని తడుముతూ ఉంటే
నీ స్పర్స ను గుర్తుచేస్తుంటే
నీ తోడు ఏది అని  ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా...... ??

నేను వేసే ప్రతి అడుగు
తన తోడును వెతుకుతూ ఉంటే
నీ తోడు ఏది అని ప్రశ్నిస్తూ ఉంటే
ఏమని బదులివ్వను ప్రియతమా....... ??
మౌనం గా తల వొంచాను వాటి ప్రశ్నలకి
ఎప్పటికీ చెప్పలేనని తెల్సి..సమాధానం చెప్పలేక .
.

అంతరిక్ష టెలెస్కోప్ తీసిన అద్భుతమైన అతిరిక్షం ఫోటోలు












Monday, September 12, 2011

'ఫేస్ బుక్' ఆఫీస్.......ఫోటోలు

ప్రపంచ వ్యాప్తంగా 50 బిలియన్ మందిని తమ సోషియల్ నెట్వర్క్ వెబ్ సైట్ మూలంగా కలుపుతున్న ఫేస్ బుక్ ఆఫీసులో ఉన్న వెబ్ సర్వర్లను చూడండి 







ఫేస్ బుక్ హెడ్ ఆఫీస్.









హైదరాబాద్ గణేష్ నిమ్మజనోత్సవం ఫోటోలు..