Saturday, September 24, 2011

‘దూకుడు’ మూవీ హిట్ పిక్చర్ గా మిగులుతుంది.... బ్లాక్ బస్టర్ మూవీ అయ్యే ఛాన్స్ లేదు..


చిత్రం: దూకుడు
నటవర్గం: మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, సోనూసూద్, నాజర్ తదితరులు
సంగీతం: తమన్
దర్శకుడు: శ్రీను వైట్ల

టూకీగా....

(హేష్ బాబు లాంటి స్టార్ హీరో విలన్స్ ని ఎదుర్కోవటానికి యాక్షన్ ని నమ్ముకోకుండా, అల్లరి నరేష్ లాగ నాటకాలాడుతూ వాళ్లను బకరాలను చేస్తూంటే ఎలా ఉంటుంది.. చూస్తున్నంతసేపూ నవ్వు వచ్చినా ఆ తర్వాత అరే.. ఇదేంటి..మనమేం చూస్తున్నాం అనిపిస్తుంది. దూకుడు చిత్రం చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. సామాన్యంగా యాక్షన్ కామిడీ లు ఎప్పుడూ సేఫ్ జోనే.. అయితే మధ్యలో ఫ్యామిలీని కూడా కలిపేసి అన్ని వర్గాలని ఆకట్టుకోవాలి అన్న ఆశే అటూ ఇటూ కాకుండా చేసేస్తుంది. మహేష్ దూకుడు కి శ్రీను వైట్ల తన టిపికల్ కామిడీతో పాటు 'అతడు' లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్, 'పోకిరి' లాంటి పోలీస్ యాక్షన్ కలపి కాక్ టెయిల్ మిక్స్ చేసి వదిలాడు. దాంతో యాక్షన్ సీన్ వచ్చిన వెంటనే కథ ప్యామిలీ ఎపిసోడ్ లోకి మారిపోయి, ఆ కాస్సేపటికే కామిడీ స్కిట్ లా రూపాంతరం చెంది, మరి కొద్దిసేపటికి రొమాన్స్ పండిస్తూంటుంది. కథలో అల్లిన ధ్రెడ్ లు ఒకదానికొకటి కలవకుండా ముందుకెళుతూంటాయి. అంతేగాక ఎప్పటిలాగే శ్రీను వైట్ల ..హీరో ఎవరైతేనేం.. కామిడీ కామన్ అన్నట్లు తన గత సినిమాల్లో పాత్రలనే మళ్ళీ రిపీట్ చేసి వదిలాడు. అవి కొన్ని సార్లు నవ్విస్తే..మరికొన్ని సార్లు ఇబ్బందిపడుతూ మనల్ని పెడతాయి. అయితే కామిడీ క్లిక్ అయితే సినిమా క్లిక్ అయ్యినట్లే అన్నది నిజమైతే ఈ దూకుడు హిట్టులోకి దూకేసినట్లే. )

 

అభిమానులు ఎన్నో ఆశలు పెట్టకున్న దూకుడు థియేటర్లలో దూకేసింది. అయిదేళ్ల తర్వాత (2006లో వచ్చిన పోకిరి తర్వాత హిట్టే లేదు కదా) అయినా మహేష్ ఆశలు, అభిమానుల కోరిక నెరవేరింది. కుర్రకారు మెచ్చిన హీరోయిన్, ఫ్యామిలీలు మెచ్చే డైరెక్టర్, టోటల్ ఆంధ్రా మెచ్చే కలిసి అద్భుతం సృష్టించారా? సెన్సార్ రిపోర్టు వచ్చినంత పాజిటివ్ గా సినిమా ఉందా అన్ని అన్ని ప్రశ్నలకు సమధానం ఈ రివ్యూ
సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తండ్రిని ప్రేమించే ఓ మంచి పోలీసు అధికారి కథ. మహేష్ బాబు. ఓ పోలీసు ఉన్నతాధికారి స్పెషల్ టీం నాయకుడు. అతను పోలీసులకు ఛాలెంజ్ గా నిలబడిన ఓ క్రిమినల్ పట్టుకోవాలి. అయితే, ఈ పోలీసు శంకరన్న (ప్రకాష్ రాజ్ – పీజేఆర్ పాత్ర అని ప్రచారం జరిగింది కానీ.. ఆ షేడ్లు మాత్రమే ఉన్నాయి) అంటే ప్రజలకు ప్రాణం వారన్నా శంకరన్నకు ప్రాణం. మంచి మనిషి. ఓ రౌడీ చేస్తున్న దందాను అడ్డుకోబోయినందుకు వాళ్లు ఆయనను లేపేస్తారు. తన లాగే ప్రజానాయకుడు అవుతాడనుకున్న శంకరన్న కొడుకు మహేష్ బాబు పోలీసు అధికారి అవుతాడు. పోలీసు డిపార్టుమెంటుకు సవాలుగా నిలిచిన గురుతల్వార్ (సోనూసూద్) ను పట్టుకునే ప్రయత్నంలో సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. గురు వేటలో కథ టర్కీకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కు వస్తుంది. ఇల్లు అద్దెకు ఇచ్చకుని నటనపై ఉన్న ఆశను నెరవేర్చుకునే బ్రహ్మానందం, సినిమాయే జీవితంగా బతికే ఎంఎస్ నారాయణల సహాయంతో (వాళ్లకు తెలియకుండానే వారిని పావులుగా వాడుకుంటూ) గురు తల్వార్ ను ఎలా పట్టుకుంటాడు అన్నదే కథ. ఇందులో ప్రధాన ట్విస్టు సోనూ హత్యా ప్రయత్నంలో కోమాలోకి వెళ్లి పద్నాలుగేళ్ల తర్వాత శంకరనారాయణ బతకడం. దీనివల్ల సినిమా మొత్తం కొత్త మలుపు తీసుకుంటుంది.
ఇక విశేషాల గురించి చెప్పాలంటే సమంత పాత్రకు ఇందులో ప్రాధాన్యం లేదు. కేవలం టర్కీలో పోలీసు ఆపరేషన్కు వెళ్లినపుడు మహేష్ కు ఆమె పరిచమయ్యే సీన్ నుంచి టర్కీలో వారిద్దరి మధ్య సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. ఇవి ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా మొదటి పావు వంతు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సీన్లు వేగంగా నడిచిపోతుంటాయి. అద్భుతంగా జాతకాలు చెప్పే శాస్త్రి (వెన్నెల కిషోర్) క్యారెక్టర్ ఫస్టాఫ్ లో అలరిస్తుంది. బ్రహ్మానందంతో చేసిన అన్ని సీన్లు పండలేదు. వాళ్ల నాన్నను సంతోషపెట్టడంలో భాగంగా మహేష్ బాబు బ్రహ్మానందం ఇంటిని, విలన్లను పట్టుకోవడానికి బ్రహ్మానందాన్ని బాగా వాడుకుంటాడు. నటనంటే పడిచచ్చే ఎంస్ నారాయణ క్యారెక్టర్ కూడా పూర్తి స్థాయిలో నవ్వించకపోయినా చాలావరకు అతను తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడితోనే ముగిసే ఆఖరి సీను నవ్విస్తుంది. ఈ సినిమాలో “కింగ్” సినిమా ట్విస్టుల విషయంలో గుర్తుకువస్తుంది. నాజర్ పాత్రతో నవ్వులు పండించడం బాగుంది. రెండో సగంలో సినిమాలో వేగం లేదు. సోనూసూద్, కోట శ్రీనివాసరావు, నాజర్, ధర్మవరపు సుబ్రమణ్యం, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు బాగా న్యాయం చేశారు. ప్రకాష్ తన పాత్ర పరిధి వరకు బాగాచేశారు. సినిమా ఆయన చుట్టూనే తిరిగినా పెద్ద పాత్రేమీ ఉండదు. అసలు ప్రకాష్ రాజ్ పాత్ర మళ్లీ బతకడంతోనే సినిమాకు సమస్యలు మొదలయ్యాయి. దీనివల్ల సాగదీత అనిపిస్తుంది. పోలీసు ఆఫీసరు పదవిని, టెక్నాలజీని వాళ్ల నాన్న కోసమే ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సుమన్, నాగబాబు పాత్రల్లో పెద్ద ఇంటెన్సిటీ లేదు. రియాలిటీ షో నటుడిగా మాత్రం బ్రహ్మానందం కొన్ని సీన్లు అదరగొట్టాడు.
పోలీసు అధికారిగా తెలంగాణ మాట్లాడే మహేష్ బాబు శంకరన్న (ప్రకాష్ రాజ్) కొడుకుగా మాత్రం మామూలు భాష మాట్లాడతాడు. ఇది అటు ఇటు అయింది. మహేష్ నోటిదూల బాగుంది. సుమన్ ను విలన్లు బంధించినపుడు మహేష్ బాబు చేసిన యాక్షన్ సీన్లు బాగా పండాయి. పాటలు సినిమాకు, ప్లస్సూ కాదు, మైనస్సూ కాదు. పార్వతి మెల్టన్ పాట మాత్రం స్కిన్ షో. దసరా సెలవులను వాడకుంటే మాత్రం కలెక్షన్లకు బెంగలేదు.
ఇందులో మహేష్ బాబు డైలాగులన్నీ అదిరిపోతాయి. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా… ఇలా మూవీ మొత్తం మంచి డైలాగులతో మహి అలరిస్తాడు.

No comments:

Post a Comment