Sunday, May 29, 2011



వితంతువు కన్నీరు తుడవలేని, ఒక అనాధ 
నోట ముద్ద అన్నం పెట్టలేని మతం పట్ల గాని 
దేవుని పట్ల గాని నాకు నమ్మకం లేదు..
                             -స్వామి వివేకానంద.

యువకులారా పేదల, అజ్ఞానుల,పీడితుల పట్ల చూపవలిసిన సానుభూతిని మీకు సంక్రమింపచేస్తున్నాను..




దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి 
సహాయనికై ఎదురుచూస్తే, అది వచ్చే తీరుతుంది .
ఈ భారాన్ని నా హృదయంలో మోస్తూ,
ఈ భావాన్ని నా మనసులో నిలుపుకొని నేను
పన్నెండేళ్లు పయనించాను. ధనవంతులనబడే,
ఘనులనబడే వారి ఇంటింటికీ నేను వెళ్ళాను.
రక్తం స్రవిస్తున్న హృదయంతో ప్రపంచంలో 
సగభాగాన్ని దాటి ఈ అన్య దేశానికి (అమెరికా )
సహాయార్ధం వచ్చాను. భగవంతుడు మహిమాన్వితుడు.
ఆయన సహాయం చేస్తాడని నాకు తెలుసు.
ఈ దేశంలో చలిని లేదా ఆకలిని తట్టుకోలేక నేను 
నశించిపోవచ్చు. కానీ యువకులారా  పేదల,
అజ్ఞానుల,పీడితుల పట్ల చూపవలిసిన 
సానుభూతిని మీకు సంక్రమింపచేస్తున్నాను..
                                       -స్వామి వివేకానంద.   

Tuesday, May 24, 2011

సంకల్పం సర్వశక్తివంతమైనది.



సంకల్పశక్తి తక్కిన శక్తులన్నింటికన్నా బలవత్తరమైనది.
అది సాక్షాత్తు భగ వంతుని నుండి వచ్చేది
కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.
నిర్మలం,బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనది.
దానిఫై విశ్వాసం ఉంచుకో.......
                                -స్వామి వివేకానంద.    

Monday, May 23, 2011

చచ్చేవరకూ పనిచేయండి



చచ్చేవరకూ పనిచేయండి.
నేను మీతోనే వున్నాను .
నేను పోయిన తరువాత నా ఆత్మ మీతో 
పనిచేస్తుంది!
ఈ జన్మ వస్తుంది, పోతుంది.
సంపదలు,పేరు ప్రతిష్టలు, సుఖ భోగాలు-
ఇవన్ని మూన్నాళ్ళ ముచ్చటలే.
ప్రాపంచిక విషయాలలో కొట్టుకునే
పురుగుల్లా చావడంకంటే, సత్యాన్ని భోదిస్తూ,
భాద్యతను నెరవేరుస్తూ మరణించడం 
చాలా, చాలా మేలు ..
                                  -స్వామి వివేకానంద  

Saturday, May 21, 2011




పేదలకోసం పరితపించి ఎవరి 
హృదయం రక్తం చిందిస్తుందో అతణ్ణి
నేను మహాత్ముడంటాను.అలా కాని
వాడు దురాత్ముడు .
లక్షలమంది  ఆకలితో, అజ్ఞానంతో 
జీవించి ఉన్నంత కాలం,వారి 
మూలంగా విద్యావంతుడై వారి గురుంచి 
పట్టించుకోని ప్రతి వ్యక్తినీ నేను ద్రోహిగా 
పరిగణిస్తాను ..
                       -స్వామి వివేకానంద. 

దాతృత్వాన్ని మించిన సుగుణం లేదు



దాతృత్వాన్ని  మించిన సుగుణం లేదు.
సర్వం గ్రహిస్తూ ఎవడు తన చేతిని 
ముడుచుకొంటాడో వాడే అత్యల్పుడు.
ఇస్తూ ఎవడు తన చేతిని చాచుతాడో 
వాడే అత్యధికుడు. సదా ఇవ్వడానికే
చెయ్యి సృజింపబడింది. పస్తుండి అయినా
నీ వద్ద వున్న పిడికెడు అన్నాన్ని పెట్టెయ్యి.
ఇతరులకి పెట్టడం వల్ల నువ్వు నిరాహారివై
మృతి చెందవలసి వస్తే, ఆ క్షణానే ముక్తుడవవుతావు. 
తక్షణమే నువ్వు పరిపూర్ణుడవవుతావు.
భగవంతుడవవుతావు.
                                    -స్వామి వివేకానంద.      

Monday, May 9, 2011

దేశమే ఒక పుణ్యభూమి, ఒక తీర్ధయాత్రాస్థలం!"...



నేను విదేశాలనుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆంగ్లేయ 
స్నేహితుడు,"స్వామీ! విలాసవంతమైన,తేజోవంతమైన, 
శక్తివంతమైన ఈ పాశ్చాత్య దేశాలలో నాలుగేళ్ళపాటు 
వున్న తరువాత,ఇప్పుడు మీ జన్మభూమిని గురుంచి మీరు
ఏమనుకుంటున్నారు?"అని  ప్రశ్నించాడు. నేను దానికిలా 
మాత్రమే జవాబివ్వగలిగాను: " నేను ఇక్కడికి 
వచ్చేముందు భారతదేశాన్ని ప్రేమించాను. కానీ 
ఇప్పుడు నాకు ఆ దేశపు దుమ్ముకూడా పరమపవిత్రంగా 
తోస్తున్నది. అక్కడి గాలికూడా నాకు పవిత్రంగా 
తోస్తున్నది. ఇప్పుడు నాకు ఆ దేశమే ఒక పుణ్యభూమి,
ఒక తీర్ధయాత్రాస్థలం!"...
                                      స్వామి వివేకానంద... 

ఒక ఆదర్శాన్ని కలిగివుండడం మంచిది.


ఏదో ఒక ఆదర్శాన్ని కలిగివున్న వ్యక్తి వెయ్యి 
పొరపాట్లు చేస్తే, ఏ అదర్శమూ  లేనివాడు యాభైవేల
పొరపాట్లు  చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను.
కాబట్టి , ఒక ఆదర్శాన్ని కలిగివుండడం మంచిది..
                                                                          స్వామి వివేకానంద..