Friday, January 14, 2011



1- విజయాన్ని సాదించాలంటే అద్భుతమైన పట్టుదల,
    సంకల్పశక్తి మీకుండాలి. పట్టుదల గల వ్యక్తి, " నేనీ
    సముద్రాన్నే ఆపోశన పట్టగలను. నా సంకల్ప మాత్రంచే 
    కొండలు పగిలి ముక్కలైపోతాయి" అంటాడు. ఆ రకమైన 
    శక్తీ, సంకల్పమూ కలిగి వుండండి; కష్టపడి పనిచేయండి,
    గమ్యాన్ని తప్పకుండా మీరు చేరతారు.   


 2 -ఒక  మహత్తర యదార్ధం ఇది: బలమే(దేహబలం,
    బుద్ధిబలం, ఆత్మబలం) జీవం, బలహీనతే మరణం. బలమే 
    సంతోషం, బలమే శాశ్వతజీవనం; బలమే అమృతత్వం;
    బలహీనత  ఎడతెగని ప్రయాస, దుఃఖం; దుర్భలతే మరణం. 

Thursday, January 13, 2011

kirankumar.vakada: విశ్వాసం, బలం పార్ట్-1

kirankumar.vakada: విశ్వాసం, బలం పార్ట్-1: "1 .మీరు భగవంతుని బిడ్డలు, అమృతసంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూమిఫైని దేవతలు - పాపులా? మనిషిని పాపి అనడం పాతకం..."

విశ్వాసం, బలం పార్ట్-1


1 .మీరు భగవంతుని బిడ్డలు, అమృతసంతానం,
   పావనులు, పరిపూర్ణులు. మీరు భూమిఫైని దేవతలు -
   పాపులా? మనిషిని పాపి అనడం పాతకం; మానవ నైజం
   మీద చేసిన నిందాలేఖనం అది. ఓ సింహసదృశులారా!
   గొర్రెలమనే భ్రాంతిని మీరు విదిలించి  వేయండి. మీరు
   అమృతజీవులు, ముక్తాత్మలు, శాశ్వతానందమయులు;
    మీరు జడప్రకృతి కాదు;  శరీరాలు కారు;
   ప్రకృతి( పంచభూతాత్మకమైన శరీరాలు; త్రిగుణాత్మకమైన
   మనస్సు) మీ దాసురాలు; అంతేగాని ప్రకృతికి మీరు
   దాసులు కారు.


2 .ఆత్మవిశ్వాసంలేని వ్యక్తి నాస్తికుడు. భగవంతుని
    పట్ల నమ్మకంలేని  వ్యక్తిని నాస్తికుడని ప్రాచీన మతాల
    నిర్వచనం. తనఫై తనకు నమ్మకం లేని  వ్యక్తి నాస్తికుడని
    ఆధునిక మతం వక్కాణిస్తున్నది..

౩. విశ్వాసం; విశ్వాసం; మన పట్ల మనకు విశ్వాసం,
    భగవంతుని పట్ల విశ్వాసం - మహత్వానికి ఇదే మూల సూత్రం.
    మన ముఫై మూడు కోట్ల పౌరాణిక  దేవతలఫైనా,
    విదేశీయులు పరిచయం చేస్తూ వచ్చిన దేవిదేవతలఫైనా
     మీకు నమ్మకం ఉన్నా - ఆత్మవిశ్వాసం లేకపోతే మీకు
     నిష్కృతి ఉండదు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండి దానిని ఆధారం
     చేసుకొని బలిష్హ్ట్టులు కండి .
                                             - స్వామి వివేకానంద

లేవండి ! మేల్కొనండి ! గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి.



ఆమరణపర్యంతం పరహితార్థమై పాటుపడండి,
మీకు తోడుగా నేనున్నాను. ఈ శరీరం నశిస్తే, నాఆత్మ మీతో
కలిసి పనిచేస్తుంది. ఈ జీవితం క్షణికం; ధనం,
పేరుప్రతిష్టలు, సుఖాలు కేవలం మూన్నాళ్ళముచట్లు.
ప్రాపంచిక భోగాల కోసం ప్రాకులాడుతూ,పురుగుల్లా మృత్యువాత
పడే కంటే, సనాతన సత్యాలను వ్యాపింపజేసే భాద్యతను
నెరవేరుస్తూ నశించడం ఉత్తమం, అత్యున్నతం...
                                                            - స్వామి వివేకానంద .

swami vivekananda


వివేకానంద జయంతి సందర్భంగా, చదువు... కెరీర్... జీవితం... అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి స్వామీ వివేకానంద సూచించిన 'కోటబుల్ కోట్స్' మీకోసం.

1. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

2. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

3. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

4. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

5. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

6. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

7. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

9. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.

10. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.

వినయంలేని విద్య,
సుగుణం లేని రూపం,
సుదుపయోగం కాని ధనం,
శౌర్యంలేని ఆయుధం,
ఆకలి లేని భోజనం,
పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి.
http://www.blogger.com/img/icon18_edit_allbkg.gif


శ్రీరామకృష్ణులు  ఒక దివ్య దృశ్యములో నరేంద్రనాథుని సప్తర్షులలో
ఒకరిగా దర్శించారు. స్వయంగా స్వామి వివేకానంద, తన సందేశ శక్తిని
ఈ విధంగా చాటి చెప్పారు. "ఈ శరీరం నుండి బయటపడి ,
దాన్ని చిరిగిన వస్త్రంలా  విసర్జించాలని నాకు అనిపించవచ్చు. కానీ
'ఈ లోకమంతా భగవన్మయమే' అనే అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందేవరకు,
ప్రపంచంలోని స్త్రీ, పురుషులందరికీ నా శక్తి స్పూర్తినిస్తుంది.

                                                                          - స్వామి వివేకానంద .

Wednesday, January 12, 2011

లేవండి ! మేల్కొనండి !!



ఒక లక్ష మంది యువతీయువకులు, పవిత్ర ఆవేశంతో
ప్రేరేపితులై, భగవంతునిలో సడలని విశ్వాసమే ఆయుధంగా ,
పేదలు, పతితులు, పీడితుల పట్ల దయతో సింహసదృశమైన
ధైర్యాన్ని పొంది, సానుభూతి, సమానత్వం ,
సామజిక పురోగతులతో సమ్మిళతమైన విముక్తి సందేశాన్ని
నేల నాలుగు చెరగులా వ్యాపింపజేస్తారు.

                                               - స్వామి వివేకానంద.

లేవండి ! మేల్కొనండి !!



మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు.
బలహీనులమని భావిస్తే బలహేనులే అవుతారు.
శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు.

                                           - స్వామి వివేకానంద.

లేవండి ! మేల్కొనండి !!


బలమే జీవితం, బలహేనతే మరణం.
బలమే శాశ్వత ఆనదం, అమృతత్వం.
 బలహేనతే దుర్భరం, నిత్య దుఃఖం,
బలహేనతే మృత్యుముఖం.

                                 - స్వామి వివేకానంద.

kirankumar.vakada: లేవండి ! మేల్కొనండి !!

kirankumar.vakada: లేవండి ! మేల్కొనండి !!: "పోరాడినా,మరణించినా స్వశక్తినే నమ్ముకోండి.లోకంలో పాపం అనేది ఏమైనా ఉంటే అది పిరికితనమే;అన్ని రకాల బలహీనతల్ని అదిగమించండి.దౌర్బల్యమే పాపం, దౌర్..."

లేవండి ! మేల్కొనండి !!

పోరాడినా,మరణించినా స్వశక్తినే నమ్ముకోండి.
లోకంలో పాపం అనేది ఏమైనా ఉంటే అది పిరికితనమే;
అన్ని రకాల బలహీనతల్ని అదిగమించండి.
దౌర్బల్యమే పాపం, దౌర్భాల్యం జీవన్మరణం.

                                                      - స్వామి వివేకానంద 

లేవండి ! మేల్కొనండి !!

దేనికీ భయపడకండి. మీరు అద్భుతాలను సాదించగలరు. 
భయపడిన మరుక్షణం ఎందుకూ పనికిరాని వారు అవుతారు.
భయమే లోకంలోని దుఃఖానికి మూలం.
భయం- విరుగుడే లేని మూఢవిశ్వాసం, మన భాదలు అన్నింటికి 
అసలు కారణం. నిర్భయత్వం క్షణాల్లో స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది.
లేవండి ! మేల్కొనండి !! గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి!

                                                                              -స్వామి వివేకానంద 

levandi ! melkondi !!

సమస్తశక్తి మీలోనే ఉంది,మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ 
సాదించ గలరు,దీన్ని నమ్మండి,బలహీనులమనే విశ్వాసాన్ని 
విడిచిపెట్టండి. మీలోని దివ్యత్వాన్ని వెలువరించేందుకు సిద్దంకండి .

                                                                                - స్వామి వివేకానంద