Saturday, April 30, 2011

కిరణ్ కుమార్. వాకాడ: పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరు...

కిరణ్ కుమార్. వాకాడ: పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరు...: "పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చెయ్యడం. ఎవడైతే పేదవాడిలో, బలహీనుడిలో , రోగిలో శివుడ్ని చూడగలుగుతాడో అతడే ని..."

పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా ఉండడం


పూజలన్నింటి సారంశం ఇదే - మనం పవిత్రంగా 
ఉండడం, ఇతరులకు మంచి చెయ్యడం. 
ఎవడైతే  పేదవాడిలో, బలహీనుడిలో , రోగిలో 
 శివుడ్ని చూడగలుగుతాడో
అతడే నిజంగా శివుడ్ని అర్చిస్తాడు; ఎవడైతే
విగ్రహంలో మాత్రమే శివుడ్ని చూస్తాడో, అతడి ఆరాధన 
ఇంకా ప్రాధమికమైనదే...     

Wednesday, April 27, 2011


ఏదో ఉన్నత స్థానంలో కూర్చుని ఐదు ఫైసలు
చేతబుచ్చుకొని, " పేదవాడా ఇదిగో" అనవద్దు.
దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతనొకడు ఉన్నందుకు 
అతడి పట్ల కృతజ్ఞుడవై ఉండు. ధన్యత దాతకేగాని దానం 
పుచ్చుకున్న వ్యక్తికి కాదు.నీ ఔదార్యాన్ని,నీ దయాగుణాన్ని 
లోకంలో అమలుపరిచి తద్వార  నువ్వు పవిత్రుడవై, పరిపూర్ణతను 
సంతరించుకోవడానికి నీకు అవకాశం లబించినందుకు 
కృతజ్ఞుడవవు..

Saturday, April 23, 2011

స్వామి వివేకానంద......



నీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్దతలు,
ఎన్ని మహిమలు దాగున్నాయో నీకు తెలుసా? మనిషిలో 
ఉన్న సర్వమూ తెలిసిన శాస్త్రవేత ఎవడున్నాడు? మానవుడు 
ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి.
అయినా అతడి శక్తులలో అణుమాత్రమే ఇప్పటికి బహిర్గతమయింది.
కనుక 'నేను దుర్బలుడిని' అనకూడదు. ఫైఫైన
కానవచ్చే అధఃకరణం అడుగున మరుగుపడి ఎంత మహత్వం 
అణిగివుందో నీ కెలా తెలుస్తుంది? నీలో అణగివున్న 
మహత్వాన్ని గూర్చి నీకు తెలిసింది అత్యల్పం. 
నీ వెనుక అనంత సముద్రం ఉంది.........
      


మానవ చరిత్ర నంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు  
చేసిన స్త్రీ, పురుషుల జీవితాలలో అన్నింటికన్నా ఎక్కువగా 
సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి, వారి ఆత్మవిశ్వాసమే అని 
తెలుస్తుంది. తాము ఘనులమనే విశ్వాసంతో వారు జన్మించారు.
ఘనులే అయ్యారు.............. 
   


విశ్వంలోని సర్వశక్తులూ మనలోనే ఉన్నాయి.
స్వయంగా మన కళ్లను మనమే చేతులతో మూసుకొని 
చీకటిగా ఉందని విలపిస్తున్నాం.మనలను చీకటి 
ఆవహించలేదని గ్రహించండి. చేతులను తొలగించి వేయండి.
ప్రారంభం నుంచి ఉన్నవెలుగు గోచరిస్తుంది.ఎన్నడూ
చీకటి లేదు, దుర్భలత లేదు. మనమే  వెర్రి వాళ్ళమై
దుర్భలురమని వాపోతున్నాం;మనమే మూర్ఖులమై
అపవిత్రులమని విలపిస్తున్నాం..