Tuesday, August 30, 2011

నీ కోసం ఒక హృదయం పరితపిస్తూ ఉంటుందని...




మూగబోయి మాటరాక మనస్సులో మాట చెప్పలేక
గుండె బారం మోయలేక వ్రాస్తున్నా నేనీలేఖ
ఏమని మోదలుపెట్టను నేస్తం నీకోసమని వ్రాస్తున్న ఈ గేయాన్ని
ఏ పూలరెక్కల్ని చిదిమి పరువను నువ్వొస్తున్న ఆ రహదారిని
ఏ గాన మేళాన్ని అడుగను నీ కోసమే ఆలపించమని
నీ స్నేహ హస్తాన్ని అందించు - చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపించు - సప్త సంద్రాలైనా దాటొస్తా
నీ హృదయంలో కాస్త చోటిపించు - ఈ జగాన్నంతా ఏలేస్తా
నువ్వు అడిగావంటే చాలు - నా ప్రాణానైనా ఇచ్చేస్తా
ఎన్నాళైనా - ఎన్నేళైనా
ఇప్పటికి - ఎప్పటికి
నీ కోసం ఒక హృదయం పరితపిస్తూ ఉంటుందని
మరచిపోవు కదా నేస్తం.......................

Monday, August 29, 2011

మావగారి ఆసుపత్రిలో రామ్ చరణ్...














భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)

1. సున్న("0") ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు)
2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.
3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.
4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.
5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.
6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.
7.గ్రీకులు,రోమనులు 105 అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.
8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే.
9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.
10.చదరంగం కనుగొన్నారు.
11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు.
12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.

జయహో స్వామి వివేకానంద! జయహో అన్నాహజారే!




దేశమంతా అవినీతినిర్మూలన కై ఉద్యమించినఅన్నాహజారే విజయం సాధించడంలో ఒక అడుగుముందుకేయడంతో ఎంతో సంతోషపడుతోంది

ఇటువంటి
 పట్టుదలఅనన్య ఆత్మవిశ్వాసం కల్గినఅన్నాహజారే నేడు మనకు లభించడం వెనుక ఉన్నఅదృశ్యశక్తి స్వామి వివేకానంద అన్న విషయంకొంతమందికి తెలుసుచాలామందికి తెలియదు.నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలన్నమనస్తత్వం నుండి బయటకులాగినవి వివేకానందునిబోధనలే అని అన్నాహజారేగారే చెప్పినారు

"
మోక్షం కోసం ప్రాకులాడను.వేల,లక్షల నరకాలకైనాపోతానునా శరీరంరాలిపోయేంత వరకు ఒక కుక్కఆకలితో అలమటించినాదానికి ఆహారం ఇచ్చేందుకు ఎన్నిసార్లు నరకానికి పోవడానికైనా నేను సిద్దమేజీవారాధనేఅనగా జీవులనుసాటిమనుషులను సేవించడమే నిజమైన శివారాధననేను చనిపోయినానా సందేశం 1500 సంవత్సరాలు జనం స్వీకరిస్తారుఅన్న వివేకానందుని వాక్యాలుఎవరినైనా తట్టిలేపుతాయి
ఇటువంటి వివేకానందుని కేవలం మతబోధకుడిగా చూస్తూ అతనిలోని మానవతావాదినిచూడలేని నేటి తరం ఎంత దురదృష్టవంతురాలో కదా
జయహో
 స్వామి వివేకానందజయహో అన్నాహజారే.

Saturday, August 27, 2011

రామ్ చరణ్ పెప్సి యాడ్ ఫోటోలు...





కరుణామయి మదర్ థెరిస్సా....

                                                              

మహోన్నతమైన వ్యక్తులు ఐదడుగులు వేస్తే ఐదువేల అడుగులవరకు వారి దివ్యత్వం వ్యాపిస్తోంది. అమ్మ మదర్ థెరిస్సా కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లెబనాన్‌లో పుట్టిన ఆమె ఇండియాకు వచ్చి భారతీయులందరికే కాదు ఈ ప్రపంచానికే అమ్మ అయింది. దాదాపు 45 ఏళ్లపాటు అనాథలకు, ఆర్తులకు, దీనుల పాలిట దేవతైంది. భారతదేశంలోని కలకత్తాను కేంద్రంగా చేసుకొని ఆ మహనీయురాలు ఆరంభించిన సేవా సంస్థలు నేడు ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి దీనులను ఆదుకుంటున్నాయి.
1   910 ఆగస్టు 26న మదర్ థెరీసా జన్మించి 1997 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. ఆమె జన్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఈ సేవామూర్తి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధులవరకు ఈ సేవామూర్తి సేవలను స్మరించుకునే రోజులివి. ఈ సందర్భంగా ఈ మహనీయురాలి జీవితంలోని కొన్ని విశేషాలు.
అమ్మ జీవితంలో ఐదు సత్యాలు
మదర్ థెరీసా తన 18వ ఏటే అంటే 1918 సెప్టెంబర్ 18న తల్లిదండ్రులను విడిచి మిషనరీని స్థాపించారు.
ఆ రోజుల్లో భారతదేశం బ్రిటీష్‌వారి పాలనలో ఉంది. కలకత్తాలోని విక్టోరియా ఆర్కిటెక్చర్ ప్రాంతం విలాసవంతమైన ధనవంతులు నివాసం ఉండే ఏరియా. దీనివెనుకే పేదలు నివసించే మురికివాడ ఉండేది. ఇక్కడనుంచే మదర్ తన సేవా కార్యక్రమాలను ఆరంభించారు.
కలకత్తా నడిబొడ్డులో మదర్ ఇల్లు ఉండేది. యువ నన్స్ ఇక్కడే సేవా కార్యక్రమాల్లో శిక్షణ తీసుకునేవారు. ఈ నన్స్‌కు రెండు చీరెలు, ఒక జత చెప్పులు, ప్రార్థనా పుస్తకాన్ని ఇచ్చేవారు.
ఆరవ పోప్ పాల్ ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో పోప్ పాల్‌ను మదర్ థెరీసా తన పనుల్లో బిజీగా ఉండి కలువలేకపోయారు. ఆమె సేవా కార్యక్రమాలను, పనులను గుర్తెరిగిన పోప్ పాల్ తన కారు స్వయంగా పంపి ఆమెను తన బస చేసిన నివాసానికి రప్పించుకుని ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారట.
చివరి క్షణాల్లో ఉన్న పేదలు ప్రశాంత జీవనం గడపటానికి ఓ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో ఆమె ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలియజేశారు. అధికారులు ఆమెను కాలిఘాట్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న స్థలాన్ని చూపించారు. ఆ స్థలం హిందువుల దేవాలయానికి వెనుకే ఉంది. అక్కడే ఆ మాతృమూర్తి ‘నిర్మల్ హృదయ్’ అనే పేరుతో భవనాన్ని నిర్మించారు. ‘నిర్మల్ హృదయ్’ అంటే స్వచ్ఛమైన మనస్సు అని అర్ధం. ఈ పేరును మదర్ థెరీసానే పెట్టారు.

అమ్మ ఎపుడూ అద్భుతమే: జోషి
ప్రేమను, ప్రేమించటాన్ని మనమే సృష్టించుకోవాలని మదర్ ఎపుడూ చెబుతుండేవారని, ఆమె మా కళ్లకు ఎపుడూ అద్భుతంగానే కనిపించేదని కేరళకు చెందిన మేరీ జోషి అంటారు. అతి పిన్నవయసులో మదర్ శిష్యురాలిగా చేరిన మేరీ జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని ఇలా తెలియజేశారు. 1968 మే 14వతేదీన మొట్టమొదటిసారి మదర్‌ను కలిశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. కేరళ నుంచి మేము రైలులో బయలుదేరి కలకత్తాకు 1968 మే 14న హౌరా స్టేషన్‌కు చేరుకొన్నాం. నాతో పాటు 20 మంది వచ్చారు. మదర్ నడిపే ఛారిటీ ట్రస్టుకు కొన్ని వస్తువులు ఇచ్చేందుకు వచ్చాం. ట్రైన్ దిగగానే ఎవరన్నా ట్రస్టు సభ్యులు వచ్చారా అని చుట్టూ చూశాం. తెల్లటి చీరలో నిర్మలమైన మోముతో మమ్మల్ని తీసుకువెళ్లటానికి మదర్ నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే ‘నమస్తే’ అని అన్నాం. కాని ఆమె మా అందరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతం చెప్పారు. ఆ చేతుల్లో ఎంతో ప్రేమ దాగివుందని తెలిసింది.
ఆ క్షణంనుంచి సెయింట్ మేరీ జోషి మదర్ అనుచరురాలిగా మారిపోయారు. మదర్ ఛారిటీ ట్రస్టులో జాయిన్ అయిన అతి పిన్నవయస్కురాలు ఆమె కావటం గమనార్హం. ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 373. జోషి కలకత్తా, ఢిల్లీ, ముంబాయిలలో పనిచేశారు. ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలపాటు మదర్‌తో కలిసి పనిచేశాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా రేయింబవళ్లు కష్టపడేవారు. ‘‘ఏ రోజు ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా ఎరుగను. ఎంతో అంకితభావంతో సేవ చేసేవారు’’ అంటూ జోషి చిన్న కన్నీటి బొట్టును వదిలారు.
కుష్ఠురోగులను చూస్తే చాలు అసహ్యించుకుంటూ దూరంగా వెళ్లిపోతాం. కాని ఈ అమ్మ వారిని అక్కున చేర్చుకుని సేవ చేసేవారు. సేవా కార్యక్రమాల్లో ఉన్నపుడు అనారోగ్యానికి గురైతే వెంటనే మమ్మల్ని ఆమె మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు అని జోషి పేర్కొంది. మదర్‌కు 1979లో నోబుల్ బహుమతి లభించినపుడు భారత ప్రభుత్వం సన్మానించి, పెద్ద పార్టీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ హంగూ, ఆర్భాటాలను తిరస్కరించి దానికయ్యే వ్యయాన్ని చెక్కు రూపంలో తీసుకుని, ఆ డబ్బును చారిటీ ఫండ్‌లో కలిపారు. ఈ చిన్ని చిన్న జ్ఞాపకాలను మదిలో భద్రపరచుకుని వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఇంకా మరింత సేవ చేయటానికి శక్తిగా భావిస్తున్నానని జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తెలిపారు. ఇలా ఎంతోమంది ఆమె సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగాపొంది ఆమె సేవా సైన్యంలో చేరినవారు ఎందరో..
ఈ విశ్వాసానికి అమ్మగా మారిన ఈ 87 ఏళ్ళ సేవామూర్తి తన జీవితకాలంలో ఎంతోమంది శిష్యురాళ్లను తయారుచేసి అన్నార్తులకు, అనాథలకు అండగా వారి చెంత చేర్చింది

అవినీతి పై అన్నా హజారే పోరాటానికి మద్దత్తు...ఫోటోలు

సింగపూర్ దేశంలో 1982 వ సంవత్సరంలో కఠినమైన లోక్ పాల్ బిల్లు ను చట్టపరం చేసేరు. లోక్ పాల్ బిల్లును చట్టపరం చేసినవెంటనే 142 మంది అవినీతి రాజకీయనాయకులనూ మరియూ ప్రభుత్వ అధికారులనూ ఖైదుచేసేరు. వారందరిమీద చర్య తీసుకున్నారు. అలాంటి కఠినమైన లోక్ పాల్ బిల్లు ఉండటం వలన ఈ రోజు సింగపూర్ దేశంలో బీదవారి సంఖ్య మరియూ పన్నులు కట్టేవారి సంఖ్య 1 శాతం గా ఉన్నది. చదువుకున్న వారి సంఖ్య 92 శాతంగా పెరిగింది. ఆరోగ్య వసతులు అత్యుత్తమైనవిగా మార్చబడింది. నిత్యావసర వస్తువులతో సహా మిగిలిన వస్తువుల ధరలు కూడా తగ్గి అందరికీ అందుబాటులో ఉన్నాయి. నిరుదోగ్య సమస్య కూడా 1 శాతం లోనే ఉన్నది. దేశంలోని మొత్త డబ్బులో 90 శాతం తెల్ల డబ్బు గా ఉండటంతో దేశం అభివ్రుద్ది చెంది కళకళ లాడుతోంది....ఆలాగే మనదేశంలో కూడా కఠినమైన లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టి, అమలుపరచి అవినీతి పరులను ఏరిపారేసి అన్ని రంగాలలోనూ భారతదేశం ముందుకు రావాలి. దీనికోసం పోరాడుతున్న అన్నా హజారే గెలవాలి. భరతదేశ పౌరుడిగా ఆయనకు జోహార్లు చెబుతూ నా మద్దత్తును తెలియపరుస్తున్నాను. 






నేను ఎందుకు ఇంతలా నిను ప్రేమిస్తున్నానో... మాటల్లో చెప్పలేను...




నేను ఎందుకు ఇంతలా నిను ప్రేమిస్తున్నానో...
మాటల్లో చెప్పలేను... నీకు చూపించనూ లేను...

నీవు చిందించిన చిరునవ్వులు, నీవు చూపించిన ఆప్యాయత, అనురాగం..
ఇంకా నను వీడలేదు, అవి నేను మరువనూ లేదు.

మనం కలిసినప్పుడు... ఒక స్నేహబంధం..
భావాలు పంచుకున్నప్పుడు... ఒక ఆత్మీయబంధం.
కలసి బ్రతకాలి అనుకున్నప్పుడు... ఒక అనురాగబంధం.

కానీ, నేనే.. నీవు నాపై వుంచిన నమ్మకాన్ని, ఆసరాగా చేసుకుని,
ఆ బంధాలని, నిన్ను దూరం చేసుకున్నాను, దూరంగా అంటే ... ఎల్లప్పటికీ...
నీవు దూరం అయ్యావు కానీ.. నీ తలపులు ఏ క్షణమూ నను వీడలేదు..

ఒంటరిగా తిరుగుతున్నా అప్పుడపుడూ.. తెలియకుండానే! నిను పిలుస్తూ...వుంటే..
నీ సమాధానం రాక.. ఓ కన్నీటి చుక్క రాలి.. నను ఓదారుస్తుంది...

అందరూ వున్నా.. ఏదో .. ఒంటరి ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా..
అన్నీ వున్నా .. ఏదీ లేనట్టుగా.. అంతా శూన్యంలో జీవిస్తున్నాను...

అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది.. నీవు లేని...నీ ప్రేమ లేని
ఇలాంటి నా ఈ జీవితం జీవించే కన్నా......... చనిపొతే బాగుంటుందేమో! అని,


నీ ముందు, నా మోకాళ్ళపై నుంచుని నిన్ను అర్ధిస్థున్నా!!
చెప్పు నేను ఏమి చెయ్యలి.....????
ఆ రోజులు తిరిగి రావటానికి! తిరిగి నీ ప్రేమ గెలవడానికి
.

మనిషి రూపంలోని దైవస్వరూపం...


మనిషి రూపంలోని దైవస్వరూపం
        -మదర్‌ థెరిస్సా
ప్రేమ, కరుణ, జాలికి ప్రతిరూపం మదర్‌ థెరెస్సా. ఆమె నిరుపేదలను, గూడులేని అభాగ్యులను, అనాథలను, వికలాంగులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని అనాథలను అక్కున చేర్చుకుంది. వారికి ఆశ్రయం కల్పించి, వారు తలదాచుకోవడానికో గూడును ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక అనాధాశ్రమాలను స్థాపించిన మదర్‌, ఎక్కువగా కలకత్తాలోని మురికివాడలలో పేదల కోసం పని చేసింది. తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేసిన మదర్‌ థెరెస్సా... ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు, కరుణకు, ఆత్మస్థైర్యానికి, నమ్మకానికి పర్యాయపదంగా నిలిచిపోయింది.

           ఒంటరిగానే ఆశయసిద్ధి కోసం ప్రయత్నం ప్రారంభించి, వేలాదిమందిని తనతో కలుపుకుని, తన మార్గంలో నడిచేలా చేసింది ఆ మహనీయురాలు. మదర్‌ థెరెసా మొదటి పేరు ఆగెస్‌ గోన్‌జా బోజాషు. అందరు  ప్రేమగా పిలుచుకునే 'మదర్‌ థెరిసా'!



           మదర్‌ 1910 ఆగస్టు 26న మాసిడోనియా రాజధాని అయిన 'స్కోప్జె' నగరంలో జన్మించింది. తను పుట్టుకతో ఆల్బేనియా దేశస్థురాలు. ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడం, 18 సంవత్సరాల వయస్సుకల్లా ఇల్లొదిలి 'సన్యాసిని (నన్‌)'గా జీవితాన్ని ప్రారంభించడం మదర్‌ జీవితంలో కీలకఘట్టాలు. 1929లో భారతదేశానికి వచ్చి 'లొరెటో కాన్వెంట్‌'లో ఉపాధ్యాయినిగా పనిచేయడం ప్రారంభించింది.   పేదలు, రోగుల కొరకు సొంతంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.  1948 నుంచి తన కార్యాచరణను ప్రారంభించి 'నిర్మల్‌ హృదరు, శాంతినగర్‌, నిర్మల్‌ శిశుభవన్‌'లాంటి శరణాలయాలను 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' పేరుతో విడతలుగా ఏర్పరిచింది. అనాథలు, రోగులు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు, మురికివాడల్లోని పిల్లలు.. ఇలా సమాజ బహిష్కరణకు గురై, తిరస్కరణ భావానకు గురై కుమిలిపోతూ మరణాన్ని ఆహ్వానించే వారందరికీ 'మదర్‌' చేయూతగా నిలిచారు.

భారతదేశంలోనేగాక నేడు 123 దేశాల్లో దాదాపు 610 కార్యాచరణ కేంద్రాలు 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' కింద పనిచేస్తున్నాయి. మదర్‌ సేవా కార్యక్రమాలకు ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. వాటిలో ముఖ్యమైనవి 1962లోని 'రామన్‌ మెగసెసే' అవార్డ్‌, 1979లో లభించిన 'నోబుల్‌ శాంతి' బహు మతి, 1980లో ఇవ్వబడిన 'భారతరత్న'. పలు దేశాల పురస్కారాలతోబాటు విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు ఆమెకు లభించాయి. మనుషుల మధ్య సేవావారధి ద్వారా మానవత్వాన్ని పెంచుతూనే మదర్‌ సెప్టెంబర్‌ 5, 1997న మరణించారు.

             ఆమె ధనాన్ని, కాలాన్ని సద్వినియోగపరిచింది. తనకు అందిన ప్రతి పైసాను కూడా దీనుల సేవకే వినియోగించింది. అలాగే ఏ ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థంగా ఖర్చుపెట్టలేదు.  ఆమెలోని అత్యంత ప్రధానమైన సుగుణాలు కరుణ, సేవ చేయడంలో సంతృప్తి చెందటం. బాధల్లో ఉన్న వ్యక్తితో సహానుభూతి పొందడం అందరికీ సాధ్యపడదు. హృదయంలో అపారమైన కరుణాభావం నిండి ఉన్నవారికే అది సాధ్యం. అందుకే దీనులను చూస్తేనే ఆమె హృదయం కరిగిపోయేది. సేవచేసి వారి బాధలను తొలగించానన్న తృప్తి ఆమెకు అపరిమితమైన శక్తినిచ్చేది.
                  

         తన జీవితం ద్వారా 'సేవ'కు సరైన అర్థాన్ని చెప్పిన 'మదర్‌ థెరిసా' జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం, స్ఫూర్తివంతం. 


నాగార్జున...రాజన్న ఫస్ట్ లుక్ పోస్టర్స్...





అమ్మ...!



ఒక మహిళ తన పిల్లవాడిని తీసుకుని మంచుకొండల్లో ప్రయాణం చేస్తోంది.

ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మహిళ ప్రయాణిస్గున్న బగ్గీ మంచులో కూరుకుపోయింది. ఆమె చనిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు.

మరుసటి రోజు సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. మంచుగడ్డల్ని తొలగించారు. అడుగున బగ్గీ కనిపించింది. బగ్గీ తెరిచి చూశారు.

అందులో మహిళ శవమై కనిపించింది. ఆమె ఒంటిమీద దుస్తులు లేవు. పక్కనే పసిబిడ్డ పడుంది. ఆమె దుస్తులన్నీ తన బిడ్డకు కప్పి, బిడ్డను తన గుండెలకు అదుముకుని వాడికి వెచ్చదనాన్ని ఇచ్చింది.

అందుకే బిడ్డ బతికే ఉన్నాడు.

ఆ తల్లి తన ప్రాణంతో తన బిడ్డకి ప్రాణం పోసింది.

ఆ బిడ్డే పెద్దవాడై ఇంగ్లండ్ కి అయిదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయనే డేవిడ్ జార్జి. 1916 నుంచి 1925 వరకూ ఆయన ప్రధానిగా చేశారు.

తన ఆఖరి శ్వాసతోనూ తన బిడ్డకి ఊపిరులూదిన ఆ తల్లికి డేవిడ్ జార్జి ఒక స్తూపాన్ని కట్టించాడు.

ఆ స్తూపం....తల్లి ప్రేమకి ప్రతీక....

తల్లిదనానికి ఒక పుత్రుడు ఎత్తిన గౌరవ పతాక.....!!

Thursday, August 25, 2011

ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తే ఇలానే ఉంటుంది !!


చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం...

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు.

ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8 శాతానికి చేరుకుంది. ఉల్లిపాయలు, బంగాళ దుంపలు, పళ్ళు, ఇతర ప్రొటీన్ ఆధారిత అహారాల ధరలు పెరిగిపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. గత వారం ఇది 9.03 శాతం ఉండగా మరుసటివారానికే 0.77 శాతం పెరిగింది. ఈ గణాంకాలు కూడా హోల్ సేల్ ధరల ఆధారంగా నిర్ణయించినవే. హోల్ సేల్ రేట్లనుండి ప్రజలకు అందేసరికి మధ్య దళారీల దోపిడీ వలన, రిటైల్ ధరలతో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే అది రెట్టింపు కంటే ఏ మాత్రం తక్కువగా ఉండదు.

గత సంవత్సర ఇదే వారాంతానికి ఆహార ద్వవ్యోల్బణం 14.56 శాతం ఉందనీ, దానితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగానే ఉందని ప్రభుత్వం సంతృప్తి పడుతోంది. వాస్తవానికి ద్రవ్యోల్బణం మూడు శాతం దాటితే అది ప్రజలపైన భారంగానే పరిణమిస్తుంది. పేద ప్రజానికైతే పెను భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వానికి తెలిసేది లెక్కలు మాత్రమే. లెక్క పెరిగితే పెరిగింది గనక కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చి మర్చిపోతారు. తగ్గితే చూశారా తగ్గించాం అని భుజాలు చరుచుకుంటారు. ద్రవ్యోల్బణం అంటే ప్రభుత్వానికి తగ్గించవలసిన అంకె మాత్రమే. కాని ప్రజలకి ద్రవ్యోల్బణం అంటే ఆకలి, పస్తులు. అర్ధాకలితో పూటగడుస్తుందా, పస్తులతో గడుస్తుందా అని రోజులు లెక్కబెట్టుకునే జీవితాలు.

పెరిగిన ఆహారధరల్లో ఉల్లిపాయలు, బంగాళ దుంపలు అత్యవసరమైన సరుకులు. బంగాళదుంప ఉత్తర భారత దేశంలో చపాతీ, నాన్ లాంటి వాటిలో తినే ఏకైక కూర. ఉల్లిపాయల సంగతి చెప్పనవసరం లేదు. పళ్లు పేద, మధ్యతరగతికి ఎలాగూ అందవు. ఎగువ మధ్యతరగతికి కూడా ఇప్పుడవి అందుబాటులో ఉండడం లేదు. “ద్రవ్యోల్బణం కట్టడి చేయడంఏ ద్రవ్య పరపతి విధానానికి ప్రధాన అంశం” అని ఆర్.బి.ఐ గవర్నరు పదవిలోకి వచ్చినప్పటినుండీ చెబుతున్నాడు. అదే మాట ప్రణాళికా శాఖ మంత్రి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలు మూడేళ్ళనుండి చెబుతున్నారు. ఆ పేరుతో బ్యాంకుల వడ్డీ రేట్లను తొమ్మిదిసార్లు పెంచారు. దానితో బ్యాంకుల్లో అప్పులు ప్రియంగా మారాయి.

ప్రభుత్వం, ప్రణాళికా సంఘం, ఆర్ధిక మంత్రిత్వ శాఖ లు ఏ గాడిదలు కాస్తున్నాయోగాని, ద్రవ్యోల్బణాన్ని గత ఆర్ధిక సంక్షోభం ముగిసినప్పటినుండీ అదుపులోకి తేలేక పోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని అవినీతి డబ్బు సమానంతర ఆర్ధికవ్యవస్ధని నడుపున్న నేపధ్యంలో ఆ డబ్బే వ్యవస్ధలో పేరుకుపోయి ద్రవ్యోల్బణం అదుపులోకి లేకుండా పోతోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా వ్యవస్ధలోని డబ్బుని వెనక్కి తీసుకోవడం వల్లనే ద్రవ్యోల్బణం ప్రస్తుత స్ధాయిలో ఉందంటే వడ్డీ రేట్లు పెంచనట్లయితే అది ఎక్కడ ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గించడమే మా ప్రధమ కర్తవ్యం అంటున్నవారు అవినీతిని, నల్లదనాన్ని అరికట్టగలిగితే ద్రవ్యోల్బణం దెబ్బకు దిగివస్తుంది.

కాని ఉన్నత స్ధానాల్లోని అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన లోక్ పాల్ బిల్లుని రూపొందించడానికే పాలకులకి నలభై సంవత్సరాలు పట్టింది. అది కూడా కోరలు లేని బిల్లని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నాయి. అవినీతిని అరికట్టేందుకు సమర్ధవంతమైన చట్టం రూపొందించలేనివారు ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పడం అంటే అవి దగాకోరు మాటలే.

గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగష్టు 6 నుండి 13 వరకు ఒక్క వారంలోనే ఉల్లిపాయల ధర 44.42 శాతం పెరిగింది. బంగాళ దుంపల ధర 16.39 శాతం, పళ్ళు 27.01 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 13.37 శాతం పెరిగాయి. ఇంకా ఇతర సరుకుల ధరలు ఎలా పెరిగింది పట్టికలో చూడవచ్చు. ఒక్క గోదుమ, కాయ ధాన్యాలు తప్ప అన్ని అహార ధరలూ పెరిగాయి. మొత్తం మీద ప్రధాన సరుకుల ధరలకు సంబంధించిన ద్రవోల్బణం 11.64 శాతం నుండి 12.4 శాతానికి పెరిగింది. టోకు ధరల సూచిలో ఈ ప్రధాన సరుకుల వాటా ఇరవై శాతం ఉంటుంది. ఫైబర్, నూనె విత్తనాలు, ఖనిజాలు తదితర ఆహారేతర సరుకుల ద్రవ్యోల్బణం 16.07 శాతం నుండి 17.80 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.

“ధరల మీద మన్నుబొయ్య, ఏలెటోడ్ని కూలదొయ్య” అన్న పాట దశాబ్దాల అనంతరం కూడా సజీవంగా ఉన్నందుకు పాటగాడ్ని అభినందించాలా? ప్రభుత్వాల్ని తిట్టిపొయ్యాలా?

Sunday, August 21, 2011

అవినీతిపై అన్నా హజారే సంధించిన దీక్షాస్త్రం - కోట్లాది భారతీయుల గుండె గొంతుకులను ప్రతిబింబించింది. ఈ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా అన్నా అభివర్ణించడాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఎందుకంటే 1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించిననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చూసుకుంటే - మిగతా దేశాలతో పోల్చిచూసుకుంటే అది అసలు అభివృద్ధే కాదు. ఇంకా సామాన్య ప్రజల జీవితాలు అలా సామాన్యంగానే ఉండిపోయాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా - అంటే సరైన రోడ్లు, తాగడానికి మంచినీరు, నాణ్యమైన విద్యుత్తు వంటి అనేక అవసరాలు దేశంలో అధిక శాతం మందికి అందుబాటులో లేవు. నేడు దేశం ఉన్న ఈ దుస్థితికి అవినీతి మాత్రమే సంపూర్ణ బాధ్యత వహించాలి. దేశంలో సహజవనరులకు గాని, మేధో వనరులకి గాని, శ్రామిక వనరులకి గాని ఏలోటు లేదు. అయితే ఈ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. సృష్టించబడిన సంపద అంతా కేవలం కొద్దిమంది చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతోంది. నిజమైన కష్టం పడే సామాన్యుడికి, మధ్య తరగతి జీవులకు ఎటువంటి  అదనపు సౌకర్యాలు అందడం లేదు. అన్నా చెప్పిన మాటల్లోని ఆంతర్యం ఇదే. అవినీతి వటవృక్షానికి మూల స్థంభాలు అధికారాన్ని చెలాయిస్తున్న రాజకీయ నాయకులు, అధికార గణం - వారి అనుచర - బంధు గణాలు మాత్రమే.   జనలోక్‌పాల్‌ బిల్లుతో అవినీతిని అరకట్టగలమా - అంటే దానికి పూర్తిగా కాదు అనే సమాధానమే వస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే - కాని 'చీకటిని తిడుతూ కూర్చునే కంటే - చిరుదీపం వెలిగించాలి' అన్నట్లుగా ఎవరూ చేయలేని పనిని 77 ఏళ్ళ ఒక 'యువకుడు' సాధించబూనడం, పోరాటపటిమతో ముందుకు నడవడం చూసి, దేశంలో యువత అంతా 'మీ వెనుక మేమున్నాం' అంటూ కదం తొక్కుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు అవినీతికి మూల కారణాలేమిటి? అని ఆలోచిస్తే సందర్భోచితంగా ఉంటుంది.
1. రాజకీయ కారణాలు: అవినీతికి మూల కారణాలు మన దేశ చరిత్రలోనే ఉన్నాయి. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాని అప్పుడు మనకు లభించింది కేవలం రాజకీయ - అధికార మార్పిడి మాత్రమే. భారతదేశాన్ని కొల్లగొట్టడానికి బ్రిటీష్‌ తెల్ల దొరలు చేసుకున్న చట్టాల్నే - భారతీయుల్ని ఇబ్బందుల పాలు చేయడానికి వారు తయారు చేసిన శిక్షాస్మృతుల్నే మనం యధాతథంగానో, కొద్ది పాటి మార్పులతోనే మన నల్ల దొరలు కూడా అనుసరిస్తున్నారు. మన దేశం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా పరిపాలనా విధానాన్ని, అధికార యంత్రాంగాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    దానికి  తోడు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే మొదటి అవినీతి ఘట్టం వెలుగుచూసి, పార్లమెంటును కుదిపేసింది. దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది కూడా ఆయన అల్లుడు, ఇందిరా గాంధీ భర్త అయిన ఫిరోజ్‌ గాంధీయే. భారతీయ సైన్యానికి జీపులు కొనుగోలు చేసినపుడు భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం - మన మొదటి ప్రధానమంత్రి - మంత్రివర్గానికే భారతదేశం పట్ల ప్రేమ లేకపోవడం. దానికితోడు మన దేశానికి స్వాతంత్య్రం పోరాటం ద్వారా వచ్చి ఉంటే ఆ కసి, పట్టుదల వేరే విధంగా ఉండేవి. ఒక సమాన్యుడు నాయకుడు అయి ఉంటే - జనం బాధ ఆయనకు తెలిసేది. ఒక ఫ్రెంచి విప్లవం కానివ్వండి - ఒక రష్యన్‌ విప్లవం కానివ్వండి - ఒక జపాన్‌ పునర్నిర్మాణం కానివ్వండి - ఇవన్నీ ప్రజల కష్టాల నుండి, వారి బాధల నుండి పుట్టాయి - జనంలోంచి వచ్చిన నాయకుల్ని తయారు చేసాయి. వారి దేశాలను ఆ స్థాయిలో నిలబెట్టాయి. కాని, పుట్టుకతోనే ఒక కోటీశ్వరుడిని - వ్యసనపరుడిని - స్త్రీలోలుడిని దేశ ప్రధాన మంత్రిగా చేయడం వల్ల సామాన్యుల బాధలు ఆయనకు తెలియకుండా పోయాయి. మనకు 1947లో జరిగింది అధికార మార్పిడి మాత్రమే - నిజమైన స్వాతంత్య్రం కాదు.

    మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - చట్టసభలకు పోటీ చేసే వ్యక్తుల విషయంలో ఎటువంటి నిబంధనలు లేకపోవడం. అప్పట్లో గాంధీగారి మాట విని చదువులు మాని, స్వాతంత్య్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు కాబట్టి, నాయకుల విద్యాస్థాయి విషయంలో ఎటువంటి నిబంధలు విధించలేదు అంటారు. కాని వాస్తవం పరిశీలిస్తే ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో ఎంతో మంది విద్యాధికులు ఉన్నారు. కేవలం పరిపాలన విషయంలో అటువంటి వారు అడ్డం కాకూడదని, - మనం చెప్పినట్టు వినే అలగా జనం, పామర జనం అయితే మన అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని, రాజ్యాంగ తయారీలోనే అటువంటి నిబంధనను కావాలనే నెహ్రూ ప్రభుత్వం చేర్చలేదని సులభంగా గ్రహించవచ్చు. మరొక ముఖ్యమైన నిబంధన - రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా అదే పదవిని పట్టుకుని వేళ్లాడవచ్చు. అది కూడా నెహ్రూ తనకు అనుకూలంగా చేసుకున్న చట్టమే - అదే అమెరికాలో అధ్యక్ష పదవికి కేవలం రెండు సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు ఎంత సమర్థుడైనప్పటికి మూడో అవకాశం ఇవ్వరు. కొత్త నీరు రావాల్సిందే - కొత్త ఆలోచనలు ఉరకలెత్తవలసిందే - అప్పుడే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ఒళ్ళంతా రోగాలు పెట్టుకుని, సరిగా నడవలేని, కళ్లు కూడా సరిగా కనబడని వారు కూడా ఈనాడు మన నాయకులే - ఎంత దౌర్భాగ్యం? ఈ నిబంధనల వల్లే అధికారం - పదవి అనేది ఒక ఇంటి వారసత్వంగా మారిపోయింది. లేకపోతే ఇంత పెద్ద దేశంలో మనకు యువ నాయకులే లేకుండా పోయారా? ఉన్నారు - కాని యువతకు అవకాశం ఇవ్వకుండా, ముసలివాళ్ళే ఎప్పటికీ అధికారంలో ఉంటే ఇక యువతకు రాజకీయాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఎందుకుంటుంది?
2. సామాజిక మార్పులు: అవినీతికి మరో ముఖ్య కారణం - మనలో ఈ దేశం మనది అనే భావన లేకపోవడం. భారత దేశ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న హిందువులు - కొన్ని వందల సంవత్సరాలుగా ఇతరుల చేతిలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. 13వ శతాబ్ది నుండి ముస్లింలు, 17 శతాబ్ది నుండి క్రైస్తవుల చేతిలో దేశం పూర్తి దోపిడీకి గురయ్యింది. దాని వల్ల ఆర్థిక అభద్రతాభావం భారతీయులలో పేరుకుపోయింది. అది వారి అలవాట్లలో గమనించవచ్చు. దొరికినప్పుడే ఎక్కువ తినేసి - తిండి లేనపుడు పస్తు పడుకోవడం అనే భావన భారతీయుల్లో అంతర్లీనంగా ఉంది. అదే భావనతో అవకాశం దొరికినపుడే దోపిడీకి బరితెగిస్తున్నారు. తమకు అవసరం ఉన్నా లేకపోయినా వేల - లక్షల కోట్ల రూపాయిలు దోచేస్తున్నారు. దీనికి సరైన విద్యావకాశాలు లేకపోవడం కూడా ఒక కారణం - ముందు భారతీయులందరినీ కుల, మత, భాషా బేధం లేకుండా చైతన్య పరచగలగాలి. వక్రీకరించబడిన చరిత్ర కాకుండా, ఉన్నదున్నట్లుగా చరిత్రను భారతీయుల ముందు ఉంచాలి. మన శక్తి మనకు తెలిసేలా - దేశం పట్ల, తోటి సమాజం పట్ల బాధ్యత తెలిసేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. భూకంపం, సునామీ వంటి దారుణమైన విపత్తులు వచ్చినపుడు కూడా క్యూలో నుంచుని, రేషన్‌ తీసుకున్న జపాన్‌ సమాజం మనకు ఆదర్శం కావాలి. వారి క్రమశిక్షణ మనకు స్ఫూర్తిని కలిగించాలి. ఎదుటి వాడిది ఏ విధంగానైనా కాజేయాలనే స్వార్థమే అవినీతికి మూల కారణం.
3. చట్టాల్లో మార్పులు: అన్నా హజారే కోరుతున్నదీ ఇదే. గ్రామ సర్పంచ్‌ దగ్గర్నుండి - ప్రధాన మంత్రి వరకు అవినీతికి పాల్పడే వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే - వారు కఠినంగా శిక్షించబడాలి. ధన సంపాదనకు రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక మార్గం కాదని అందరూ గ్రహించాలి. అవి ప్రజలకు సేవ చేయడానికి లభించే అవకాశంగా తెలియరావాలి. ప్రజలకు మంచి చేయాలి తప్పితే వారి సొమ్మును కొల్లగొడదామనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదనే భావన సమాజంలో కల్గించాలి. వీటితో పాటుగా కుల సంఘాలని రద్దు చేయాలి, ప్రాంతీయవాదాల్ని మొగ్గలోనే తుంచేయాలి. మతం పేరు చెప్పి విధ్వంసం సృష్టించేవారిని నామరూపాలు లేకుండా చేయాలి. నేతలతో పాటుగా దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రతీ ప్రాంతీయ శక్తిని, కుల, మత శక్తుల్ని అదుపులోకి తీసుకుని కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే అవినీతి సమూలంగా అంతమవుతుంది.

    అన్నా చెప్పిట్లుగా ఇది నిజంగా రెండో స్వాతంత్య్ర సంగ్రామమే. దేశ రాజకీయ, అధికార, సామాజిక, ఆర్థిక రంగాల్లో, ప్రజల మనస్తత్వాలలో సమూల ప్రక్షాళన జరగవలసిన సమయం ఆసన్నమయింది. 77 ఏళ్ల యువకుడు నడిపిస్తున్న ఈ పోరాటానికి మద్దతు తెలపవలసిన నైతిక బాధ్యత మనందరి పైనా ఉంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అని హజారే అన్నట్లుగా ఇదొక సువర్ణావకాశం - జారవిడుచుకుంటే మళ్లీ రాదు. అందుకే - జై అన్నా హజారే.