Monday, July 4, 2011

నా హృదయ మందిరంలోకే కదా........!



నువ్వు వెళ్ళిపోయావని అందరూ అంటున్నారు.
ఎక్కడకి వెళ్ళావని.......

హుందాగా నడుచుకుంటూ 
నా హృదయ మందిరంలోకే కదా........! 

ప్రేమ...



భాష లేని మౌనం ప్రేమ...
రూపం లేని శిల్పం ప్రేమ ...
ఓటమెరుగని విజయం ప్రేమ ...
భయాన్ని జయించే ధైర్యం ప్రేమ...
రక్తం రుచి చూడని ఖడ్గమే ప్రేమ...

వాళ్ళేం పీకలేరంటున్న యువహీరో


ఇటీవలే హీరో సిద్దార్థ్ మీడియాఫై  కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో,
మీడియాకు క్షమాపణలు చెప్పాలని... ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు 
ఫిలించాంబర్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయం గురుంచి సిద్దు తన స్నేహితులతో..'మీడియా వాళ్లు నన్నేం
చేస్తారు. వాళ్లు ఏం పీకలేరు.నా ట్విట్టర్ నుంచి ఆ వ్యాఖ్యాలను తొలగించే ప్రసక్తే
లేదు' అంటూ చెప్పాడంట. ఇవే మాటలు మీడియాతో అని ఉంటే ఇప్పటికి 
సిద్దార్థ పరిస్థితి ఎలా వుండేదో ఒక్కసారి ఊహించుకోండి..


దీపికా అంటే భయపడుతున్న హీరో..


బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న దీపిక పదుకునేకు ప్రస్తుతం 
బాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్ హీరోలు బయపడుతున్నారు.

ఇటీవలే రజనీకాంత్ హీరోగా నటించనున్న 'రాణా' చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునేను 
తీసుకున్నారు. అయితే ఈ అమ్మడు ఐరన్ లెగ్ వలన ఈ సినిమా ఆగిపోయింది. ఫైగా రజనీ హాస్పటల్ 
పాలయ్యాడు. తాజాగా కమల్ హాసన్ హీరోగా నిటిస్తున్న తాజాగా చిత్రం 'విశ్వరూపం' చిత్రంలో హీరోయిన్ గా 
  ముందు దీపికానే అనుకున్నారు.కానీ 'రాణా' దెబ్బతో కమల్ బయపడిపోయి దీపికా వద్దంటే వద్దు అని 
స్టేట్ మెంట్ ఇచ్చేసాడట.

Sunday, July 3, 2011

నయన కోసం కోర్టు కెక్కిన ప్రభుదేవా..


ప్రభుదేవా తన మొదటిభార్య రామలతతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన 
సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుదేవా తన ఆస్తులకు సంబంధించిన 
దస్తావేదులను కోర్టుకు సమర్పించారు. అయితే ప్రభుదేవా-రామలతలకు విడాకులు 
వచ్చిన కేవలం నెలరోజుల కాలంలోనే హీరొయిన్ నయనతారను వివాహం 
చేసుకోనున్నాడనే తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుదేవా-నయనతారలు రెండు సినిమాలతో బిజీగా వున్నారు. ఈ చిత్రాల 
అనంతరం వీరు ఇద్దరూ వివాహం చేసుకోనున్నారు. తాజాగా నయనతార నటించిన  
'శ్రీ రామరాజ్యం ' చిత్రం షూటింగ్  ఇటీవలే పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది..


నిర్మాతని మోసం చేస్తున్న దర్శకుడు ..


ప్రతి సినిమాలో కూడా సెట్స్ వేసి నిర్మాతలకు తలనొప్పిని కలిగిస్తున్న దర్శకుడు 
గుణశేఖర్. అయితే ఇక మీదట సెట్స్ లేకుండా సినిమాలు చేస్తానని  స్టేట్ మెంట్ 
ఇచ్చిన గుణశేఖర్ మళ్లీ మాట తప్పుతున్నాడు.

తాజాగా  రవితేజ హీరోగా వై.వి.యస్.చౌదరి  నిర్మిస్తున్న తాజా చిత్రం 'నిప్పు'.
గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఎలాంటి 
సెట్స్ ఉండవని ముందుగా తెలుసుకున్న తరువాతే నిర్మాత   వై.వి.యస్.చౌదరి
ఈ చిత్రానికి దర్శకత్వం వహించమని  గుణశేఖర్ కు ఈ సినిమా భాద్యతను అందించాడు.

అయితే నిర్మాతకు ఇచ్చిన మాటకు విరుద్ధంగా .. ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ 
ఆనంద్ సాయితో దాదాపు 6 సెట్లకు సంబంధించిన పేపర్ వర్క్ ఇచ్చాడంట.
అయితే ఈ గుణశేఖర్ చెప్పిన ఈ సెట్స్ వేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు 
అవుతుందట. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత వై.వి.యస్. ఒక్కసారిగా షాక్ తిన్నాడంట. 

ప్రస్తుతం వై.వి.యస్. చెన్నైకి వెళ్ళిపోయాడు .చెన్నై నుండి వచ్చిన తరువాత ఈ సెట్స్ 
గురుంచి వై.వ.యస్. ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నాడు.

నా మనసుకే ఎవ్వరూ లేరు పాపం...



ప్రియా...!
       నువ్వు వెళ్ళిపోయాక  కూడా
       నాకు చాలా మంది ఉన్నారు..
కానీ..
       నా మనసుకే ఎవ్వరూ లేరు పాపం...

భారతదేశంలో మహిళలకు ఆదర్శం మాతృత్వమే .



భారతదేశంలో మహిళలకు ఆదర్శం మాతృత్వమే .
ఆ అద్భుతమైన, నిస్వార్ధమైన తల్లి ,
అన్నింటినీ భరించి, ఎల్లవేళలా క్షమించే తల్లి
మన మహిళలకు ఆదర్శం.. 

ఆ సీతా మాతలా ఉండడానికి ప్రయత్నించండి.



సీతను  పరిచయం చేసిన మన జాతికి 
యావత్ ప్రపంచం ఋణపడివుంది.
స్త్రీలపట్ల మనకు గల గౌరవం సాటిలేనిది.
మంచికిగాని, పవిత్రతకుగాని, పాతి వ్రత్యానికిగాని, 
భారతీయ మహిళా  ధర్మానికిగాని  సీత పెట్టింది పేరు.
ఆ సీతామాతలా  ఉండడానికి ప్రయత్నించండి.



చిరునవ్వుల వరమిస్తావా..?
                   చితి నుండి లేచొస్తాను..
మరుజన్మకు కరుణిస్తావా..?
                  ఈ క్షణమే మరణిస్తాను..


ప్రియా నీ కోసం...



ఈ ప్రపంచానికి నువ్వు ఒక అమ్మాయివి మాత్రమే  కానీ........

నాకు నువ్వే ప్రపంచం.. 

ప్రియా నీ కోసం...



పగలంతా నీ రూపాన్ని పలకరిస్తూ !
రాత్రంతా నీ రూపాన్ని కలవరిస్తూ !!
                        -ఇదే నా దినచర్య..

Saturday, July 2, 2011

స్వామి వివేకానంద....,



రహస్యంగా ఇతరులను నిందించడం 
పాతకమని గ్రహించు, 
దాన్ని నువ్వు పూర్తిగా విడనాడాలి. 
మనస్సుకు అనేక విషయాలు తోచవచ్చు.
కాని వాటిని వెల్లడింప పూనుకుంటే,
గోరంతలు కొండంతలు అవుతాయి.
క్షమాగుణం, విస్మరణ చేతనే సర్వం అంతమొందుతుంది.
                                             -స్వామి వివేకానంద. 

స్వామి వివేకానంద....,



ఎంతో తపస్సు చేసిన తరువాత 
ప్రతి జీవిలోనూ భగవంతుడు వున్నాడనే
పరమ సత్యాన్ని నేను అవగతం చేసుకున్నాను.
అంతకుమించి ఇతర దైవం లేదు.
ఎవడు జీవారాధకుడో అతడే నిజమైన  దైవారాధకుడు..

                                   -స్వామి వివేకానంద .