ఇటువంటి పట్టుదల, అనన్య ఆత్మవిశ్వాసం కల్గినఅన్నాహజారే నేడు మనకు లభించడం వెనుక ఉన్నఅదృశ్యశక్తి స్వామి వివేకానంద అన్న విషయంకొంతమందికి తెలుసు. చాలామందికి తెలియదు.నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలన్నమనస్తత్వం నుండి బయటకులాగినవి వివేకానందునిబోధనలే అని అన్నాహజారేగారే చెప్పినారు.
"మోక్షం కోసం ప్రాకులాడను.వేల,లక్షల నరకాలకైనాపోతాను. నా శరీరంరాలిపోయేంత వరకు ఒక కుక్కఆకలితో అలమటించినాదానికి ఆహారం ఇచ్చేందుకు ఎన్నిసార్లు నరకానికి పోవడానికైనా నేను సిద్దమే. జీవారాధనేఅనగా జీవులనుసాటిమనుషులను సేవించడమే నిజమైన శివారాధన. నేను చనిపోయినానా సందేశం 1500 సంవత్సరాలు జనం స్వీకరిస్తారు" అన్న వివేకానందుని వాక్యాలుఎవరినైనా తట్టిలేపుతాయి.
ఇటువంటి వివేకానందుని కేవలం మతబోధకుడిగా చూస్తూ అతనిలోని మానవతావాదినిచూడలేని నేటి తరం ఎంత దురదృష్టవంతురాలో కదా!
జయహో స్వామి వివేకానంద, జయహో అన్నాహజారే.
No comments:
Post a Comment