పావనులు, పరిపూర్ణులు. మీరు భూమిఫైని దేవతలు -
పాపులా? మనిషిని పాపి అనడం పాతకం; మానవ నైజం
మీద చేసిన నిందాలేఖనం అది. ఓ సింహసదృశులారా!
గొర్రెలమనే భ్రాంతిని మీరు విదిలించి వేయండి. మీరు
అమృతజీవులు, ముక్తాత్మలు, శాశ్వతానందమయులు;
మీరు జడప్రకృతి కాదు; శరీరాలు కారు;
ప్రకృతి( పంచభూతాత్మకమైన శరీరాలు; త్రిగుణాత్మకమైన
మనస్సు) మీ దాసురాలు; అంతేగాని ప్రకృతికి మీరు
దాసులు కారు.
2 .ఆత్మవిశ్వాసంలేని వ్యక్తి నాస్తికుడు. భగవంతుని
పట్ల నమ్మకంలేని వ్యక్తిని నాస్తికుడని ప్రాచీన మతాల
నిర్వచనం. తనఫై తనకు నమ్మకం లేని వ్యక్తి నాస్తికుడని
ఆధునిక మతం వక్కాణిస్తున్నది..
౩. విశ్వాసం; విశ్వాసం; మన పట్ల మనకు విశ్వాసం,
భగవంతుని పట్ల విశ్వాసం - మహత్వానికి ఇదే మూల సూత్రం.
మన ముఫై మూడు కోట్ల పౌరాణిక దేవతలఫైనా,
విదేశీయులు పరిచయం చేస్తూ వచ్చిన దేవిదేవతలఫైనా
మీకు నమ్మకం ఉన్నా - ఆత్మవిశ్వాసం లేకపోతే మీకు
నిష్కృతి ఉండదు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండి దానిని ఆధారం
చేసుకొని బలిష్హ్ట్టులు కండి .
- స్వామి వివేకానంద
No comments:
Post a Comment