సెప్టెంబర్ 27 న ధర్నా, అక్టోబర్ 10 న సమ్మె ఉద్యోగులు
2009 లో 3,97,000 మంది ఉద్యోగులుండేవాళ్ళు. ప్రస్తుతం 276,000 మంది పనిచేస్తున్నారు. అంటే లక్షా ఇరవై వేలమందికి పైగా తగ్గారు. కారణం రిటైరైన వాళ్ళ స్తానంలో నియామకాలు నిలపటమే. అయినా ఇది ప్రభుత్వానికి చాలలేదు. మరో లక్షమందిని ఇంటికి పంపాలని మంకుపట్టుతో ఉంది. 2000 నుంచీ 2009 దాకా లాభాలలోనే నడిచింది. తొలిసారి 2009-2010 సంవత్సరంలో ప్రభుత్వ విధానాల మూలంగా 1823 కోట్లు నష్టం నమోదు చేసింది. 2010-2011 లో నష్టం 6384 కోట్లు. ఉద్యోగుల జీతాల వల్లే నష్టాలంటూ ప్రభుత్వమూ, యాజమాన్యమూ ప్రచారం చేస్తున్నాయి.2009-2010 లో ఆదాయంలో 42 శాతం జీతాలకి ఖర్చయిందనీ, 2010-11 లో 46.5శాతం అనీ ,ప్రైవేట్ కంపెనీలకి 5శాతం మాత్రమే అవుతుందనీ వాదన. ప్రస్తుతం 49 శాతం అని ఆర్.కే. ఉపాధ్యాయ బి.ఎస్.ఎన్.ఎల్ చైర్మన్ 2011 ఆగస్ట్ చివరలో ప్ర ప్రకటించాడు . ఇదే పెద్ద సమస్య అన్నాడు. ఎయిర్‌టెల్ లో 25,000 మంది మాత్రమే పనిచేస్తున్నారనీ,పైగా ఆసంస్తకి బీ.ఎస్.ఎన్.ఎల్ కన్నా ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారనీ కనక ఇందులో ఉద్యోగుల్ని తగ్గించాలనీ పట్టుబడుతున్నారు.
45 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులు. ఒక లక్షమందికి ఈప్రతిపాదన వర్తిస్తుంది. మొత్తం ఖర్చు 20,802 కోట్లు.ఇందులో బి.ఎస్.ఎన్.ఎల్ వాటా 2705 కోట్లు. పోగా 18,097 కోట్లు డాట్ వాటా. ఒక ఉద్యోగికి సగటున వచ్చేది 20.8 లక్షలు. పనిచేసిన సంవత్సరానికి రెణ్ణెల్ల జీతం చొప్పున వచ్చే మొత్తం గానీ, మిగిలిన సర్వీసుకు రావలసిన జీతం మొత్తం గానీ - రెంటిలో ఏది తక్కువయితే అది వస్తుంది. మీకిది లాభదాయకం అంటూ ఉద్యోగుల్ని ఊరిస్తున్నది. శాం పిట్రోడా సిఫారస్ ప్రకారం లక్షమందిని తగ్గించాలని ప్రభుత్వ పట్టుదల.
సరే లక్షతొ ఆగుతుందా? ఎయిర్ టెల్ 25000 మందితో నడుస్తున్నప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్ ఎందుకు నడవదు, అనేది తర్వాత ప్రస్న కాదా? 25 వేలకి కుదించే కార్యక్రమం అంచెలంచెలుగా కొనసాగదని గారెంటీ ఏమిటి? అలా చేసినా చాలదు. పోటీ సంస్తకి లాగే జీతాల ఖర్చు 5 శాతాని తేవాలనే కోరిక పుట్టదా? చౌకగా దొరికే వాళ్ళతో పనిచేయించుకుని లాభాలు దండుకునే ప్రైవేట్ యజమానుల దుష్ట వాంఛ ప్రబుత్వాల తలకెక్కింది.
ఇష్టమైన వాళ్ళు పదవీవిరమణ పధకాన్ని వినియోగించుకోవచ్చు. బలవంతం లేదు అని యాజమాన్యం అంటున్నది కాని దాని లోగుట్టు, ఆంతర్యం ఉద్యోగులకు తెలుసు. ఇతర దేశాల్లో ఎమిజరిగిందో గమనించారు.యూనియన్లు సరే అంటే చాలు. సుదూర ప్రాంతాలకి బదిలీ చేసి లొంగేట్టు చేసిన సందర్భాలు విదేశీ టెలికాం రంగంలో లెక్కకు మించి ఉన్నాయి.
నయానో, భయానో ఇళ్ళకుపంపి సంస్తని ప్రైవేటు కంపెనీలకి అమ్మాలనేది ఆంతర్యం. ఆ కంపెనీలనుంచి భారీస్తాయిలో ముడుపులు దండుకోవటం తెలిసిందే. పైగా సంస్తకి భారీస్తాయిలో భూములున్నాయి. వాటిని ప్రైవేటుకి చౌకగా కట్టబెట్టి అంతులేని అవినీతికి పాల్పడలన్నదే పాలకుల కోరిక. ఆఆశతోనే ఇందుకొడిగడతున్నారు.
ఈదుష్ట పధకాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరూ కలిసి సెప్టెంబర్27 న ధర్నా చేశారు. అక్టోబర్ 10 న సమ్మే చేయబోతున్నారు. ఉద్యోగులు విజయం సాధించాలని అందరం కోరుకుందాం. సహకరిద్దాం.
No comments:
Post a Comment